రాశి ఖన్నా తెలుగు తెరకి పరిచయమై చాలాకాలమే అయింది .. అయినా కెరియర్ గ్రాఫ్ నత్తలా నాజూకుగా కదులుతోంది. చకచకా సినిమాలు చేసిందీ లేదు .. టకటకా థియేటర్లలో దిగిపోయింది లేదు. ‘వస్తే చేద్దాం .. రాకపోతే చూద్దాం’ అన్నట్టుగానే ఆమె తన కెరియర్ ను సాగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చిన కొన్ని అవకాశాల్లో అదృష్టం కొద్దీ కొన్ని హిట్ అయ్యాయి. దాంతో మరికొన్ని అవకాశాలు రావడం జరుగుతూ వచ్చింది. కానీ ఆమె తనదైన స్టైల్లో దూకుడు చూపించలేదనేది మాత్రం వాస్తవం.

నిజానికి రాశి ఖన్నా మంచి అందగత్తె .. అయితే ఏ ఇండస్ట్రీలోనైనా కొన్ని పాలసీలు .. పరిచయాలు లేకపోతే నిలదొక్కుకోవడం కష్టం. దబ్బపండంతా గ్లామర్ ఉండగానే సరిపోదు .. నిమ్మపండంత లౌక్యం కూడా కావాలి. లేదంటే ఇండస్ట్రీలోనే కాదు .. సెట్లో కూడా నిలబడే పరి స్థితులు ఉండవు. ఈ విషయాన్ని గ్రహించినవారే ముందుకు దూసుకుపోతారు. లేదంటే అయ్యో అన్ని తలుపులు మూసుకుపోయాయేనని దిగాలుపడిపోతారు. ఇతర భాషల్లోను ఇంతేకదా అనుకుంటూ ఇంటికి వెళ్లిపోతారు.

కొత్తగా వస్తున్న పిల్లలు రాజకోటలో పాగా వేస్తుంటే, ఇంకా తాను తులసికోట దగ్గరే కూర్చుంటే లాభం లేదనే విషయాన్ని రాశి ఖన్నా గ్రహించేసింది. అందుకే తన గ్లామర్ తో కోలీవుడ్ .. బాలీవుడ్ పై కూడా దాడి చేయడానికి సిద్ధమవుతోంది. కుర్ర మనసుల్లో కుంపటి రాజేసే ప్రోగ్రామ్ లు పెట్టేసింది. అందులో భాగంగానే ఇదిగో .. సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోలు వదిలింది. షూటింగు గ్యాపులో హాయిగా గోవాలోని స్విమ్మింగ్ పూల్లో ఇలా జలకాలాడుతూ సేదతీరుతోంది. హఠాత్తుగా చూస్తే ఏ జలకన్యనో అలసిపోయి ఒడ్డుకు చేరినట్టు .. ఏ రాజహంసనో దారితప్పి వచ్చినట్టు కనిపిస్తుంది కదూ! ఇంతటి అందాలను తడపలేక స్విమ్మింగ్ పూల్లోని నీళ్లు కూడా అలసి పోయినట్టుగా అనిపించడం లేదూ!!
Must Read ;- మరింత నాజూకుగా మారుతున్న రాశి ఖన్నా











