కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు సినిమాలు విడుదలను వాయిదా వేసుకోవడంతో పాటు .. షూటింగ్స్ ను కూడా నిలిపివేస్తున్నాయి. అయితే నాగచైతన్య థాంక్యూ సినిమా మాత్రం .. ఇప్పటివరకూ ఇటలీలో షూటింగ్ జరుపుకుంది. విదేశాల్లో కాబట్టి.. షూటింగ్ కు ఏ విధంగానూ అడ్డంకి రాదని భావించారు మేకర్స్ . అయితే ఈ సినిమా షూటింగ్ కూడా రీసెంట్ గా ఆగిపోయిందనే వార్తలొస్తున్నాయి.
విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న థాంక్యూ మూవీలో రాశీఖన్నా కథానాయికగా నటిస్తోంది. సినిమా చిత్రీకరణంలో భాగంగా ఓ షెడ్యూల్ ను నెల రోజల క్రితం ఇటలీలో ప్రారంభించింది చిత్ర బృందం. అయితే ఈ షెడ్యూల్ లో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ జాయిన్ అవడం ఒక రోజు లేటయిందట.
అయితే ఇటలీకి భారతీయ ప్రయాణంపై ఆంక్షలు విధించడంతో .. ప్రస్తుతం ఇటలీ షెడ్యూల్ కీ బ్రేకులు పడినట్టు వార్తలొస్తున్నాయి. ఆల్రెడీ నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి తాజా చిత్రం థాంక్యూ షూటింగ్ కి కూడా కరోనా సెకండ్ వేవ్ బ్రేకులు వేయడం గమనార్హం. మరి ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందో చూడాలి.
Must Read ;- వెంకీ ‘నారప్ప’ విడుదలకు కూడా చెక్ పెట్టిన సెకండ్ వేవ్