భారతీయ తెరమీద బయోపిక్స్ కు మంచి ఆదరణ దక్కుతోంది. ఒకప్పటి ప్రఖ్యాత సినీ తారలుగా ఇప్పటి క్రేజీ తారలు నటిస్తే అభిమానులకు అదో కిక్కు. మొన్నీ మధ్య మహానటి సావిత్రి పాత్రను కీర్తి సురేశ్ అనితర సాధ్యంగా పోషించి.. మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ప్రఖ్యాత తార జీవిత చరిత్ర లో .. ఓ క్రేజీ బ్యూటీ నటిస్తూండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ మరో మహా నటీమణి మరెవరో కాదు. అప్పటి అందాల తార జమున. ప్రస్తుతం ఆమె బయోపిక్ ను తెరకెక్కించడానికి టాలీవుడ్ లో సన్నాహాలు జరుగుతున్నాయి.
ఒకప్పటి టాలీవుడ్ స్వర్ణయుగపు రోజుల్లో .. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జమున .. ఇప్పటికీ చెలాకీగా ఉన్నారు. ఆమె పాత్రను మిల్కీ బ్యూటీ తమన్నా పోషించనుండడం విశేషంగా మారింది. ఈ సినిమాని శివనాగు నర్రా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం దర్శకుడు తమన్నాతో చర్చలు జరుపుతున్నాడట. మరి ఈ సినిమాలో నటించడానికి జమున పాత్రను తన టాలెంట్ తో తెరపై ఆవిష్కరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ సినిమా ఎప్పుడు తెరకెక్కుతుందో చూడాలి.
Must Read ;- సౌందర్య బయోపిక్ కు వేళాయెరా.. !