ఎంతటి బాహుబలి అయినా ప్రియురాలికి దాసోహమే. అందుకేనేమో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దృష్టి ‘రాధేశ్యామ్’లాంటి ప్రేమ కావ్యంపై పడింది. ఈ సినిమాకి సంబంధించిన తాజా అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తామని ముందే అప్ డేట్ ఇచ్చారు. ఆ టీజర్ రాకముందే లీకుల పర్వం మొదలైంది. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రేరణగా పూజా హెగ్డే, విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనున్నారన్న సంగతి తెలిసిందే. మరి రాధేశ్యామ్ టైటిల్ జస్టిఫికేషన్ ఎలా జరుగుతుందో చూడాలి.

టీజర్ లీకుల విషయానికి వస్తే విక్రమాదిత్య పాత్ర ప్రత్యేకత ఏమిటన్నది రివీల్ అవుతుందని తెలుస్తోంది. ప్రభాస్ నోట ఇటాలియన్ డైలాగ్స్ తో టీజర్ స్టార్ట్ అవుతుందట. ప్రేరణగా పూజా హెగ్డే వేసే పొగరైన ప్రశ్నకు ప్రభాస్ చెప్పే డైలాగ్ ఈ టీజర్ ప్రత్యేకత. ఆ డైలాగ్స్ ఏమిటో చూద్దాం. ‘నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?’ అని ప్రశ్నిస్తుందట ప్రేరణ. దానికి విక్రమాదిత్య ‘ప్రేమ కోసం రోమియో చనిపోయాడు.. మనం అలా కాదు’ అంటాడట. ఈ ఇద్దరు ప్రేమికుల సంభాషణ ఈ టీజర్ కు హైలైట్ గా చెబుతున్నారు. అసలు ఈ డైలాగ్స్ ఇలానే ఉంటాయా లేదా ఇది అభిమానుల ఊహా అన్నది రేపు టీజర్ వచ్చాక చూడాలి.
రొమాంటిక్ లవ్ అడ్వంచర్ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ప్రేమికుల రోజన ప్రేమ పూరిత డైలాగ్స్ తో టీజర్ విడుదల చేస్తే యాప్ట్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ టీజర్ కట్ చేశారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల టీజర్ ల లీకులు ఎక్కువగా వస్తున్నాయి. కేజీఎఫ్ 2 విషయంలో అలా జరగడంతో ముందే టీజర్ ను విడుదల చేయాల్సి వచ్చింది. ఈ లీకులు పబ్లిక్ స్టంట్ లో భాగమన్న మాట కూడా వినిపిస్తోంది. ఇలా లీకులు రావడం వల్ల అవి వైరల్ అవుతున్నాయి.
Must Read ;- గ్లింప్స్ టాక్: రోమియో, జూలియట్ తరహా ప్రేమకథే ‘రాధేశ్యామ్’











