ఇటీవల ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ తో మిశ్రమ ఫలితం అందుకున్న సందీప్ కిషన్ .. ఇప్పుడో కామెడీ మూవీ మీద తన ఫోకస్ అంతటినీ పెట్టాడు. సినిమా ‘రౌడీ బేబీ’. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ‘గల్లీ రౌడీ’ గా మారింది . కోన ఫిల్మ్ కార్పోరేషన్, యం.వీ.వీ సినిమా పతాకలపై.. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో యం.వీ.వీ. సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
సినిమా లాంఛ్ అవడమే ‘రౌడీ బేబీ’ టైటిల్ తో జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా టైటిల్ ను మార్చుతున్నట్టు.. త్వరలోనే కొత్త టైటిల్ ను ప్రకటిస్తున్నట్టు చెప్పారు మేకర్స్. అనుకున్నట్టుగానే ఈ రోజు సినిమా కి ‘గల్లీ రౌడీ’ అనే టైటిల్ ను ప్రకటించారు.
సందీప్ కిషన్, నేహాశెట్టి జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో రాజేంద్రప్రసాద్, మరో ముఖ్యపాత్రలో తమిళ నటుడు బాబీ సింహా నటిస్తున్నారు. హర్ష, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయబోతున్నట్టు సమాచారం. మరి గల్లీరౌడీగా సందీప్ కిషన్ ఎలా మెప్పిస్తాడో చూడాలి.
Also Read : రామ్ చరణ్ -శంకర్ సినిమా పై క్రేజీ అప్టేట్స్
Presenting the #GullyRowdy🔥
Here's the new title of @KonaFilmCorp & @MVVCinema_'s #ProductionNo5
The title changed, not the fun & Entertainment😆🤘@sundeepkishan @actorSimha #NehaShetty #GNageswaraReddy #RamMiryala @iamsaikartheek @ChotaKPrasad @NeerajaKona @konavenkat99 pic.twitter.com/1QqggUUGK1
— KonaFilmCorporation (@KonaFilmCorp) March 25, 2021