యంగ్ హీరో సందీప్ కిషన్ .. ఎర్లియర్ గా ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ మూవీ తో మిశ్రమ ఫలితం అందుకున్నాడు. సినిమా మంచి కాన్సెప్ట్ తో రూపొందినా.. సరైన రీతిలో వసూళ్ళను సాధించలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో రెడీ అవుతున్నాడు సందీప్ . సినిమా పేరు ‘గల్లీరౌడీ’. నిజానికి ఈ సినిమాకి ముందుగా రౌడీ బేబీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే కొన్ని కారణాలతో ‘గల్లీరౌడీ’గా టైటిల్ ను మార్చారు.
కామెడీ చిత్రాల దర్శకుడు జీ. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్ఫణలో ఈ సినిమా రూపొందింది. ఔట్ అండ్ ఔట్ కామెడీ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రను తమిళ నటుడు బాబీ సింహా పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మే 21న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు మేకర్స్.
తాత రౌడీ. తండ్రి రౌడీ. అందుకే తాను రౌడీయిజానికి దూరంగా ఉందామనుకుంటాడు హీరో. అయితే .. వాళ్ళ బలవంతం వల్ల రౌడీగా ముద్రపడి గల్లీ రౌడీ అవుతాడు హీరో. చివరికి హీరో రౌడీగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. వైజాగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నేహాశెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాతో సందీప్ కిషన్ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో చూడాలి.
Must Read ;- అర్జున్ రెడ్డి దర్శకుడితో మహేష్ బాబు, తమన్నా
He'll make you laugh, he'll leave you stunned!
Meet our #GullyRowdy🔥 a.k.a @sundeepkishan In theatres on May 21st#GullyRowdyOnMay21st@actorsimha #NehaHarirajShetty #GNageswaraReddy #RamMiryala @iamsaikartheek @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp @MangoMusicLabel pic.twitter.com/Ioj37mzx23— KonaFilmCorporation (@KonaFilmCorp) April 4, 2021