ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఇంటింటికి రేషన్ పథకం అభాసుపాలవుతోంది. ఏటా ఇంటింటికి రేషన్ కోసం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. వాహనదారులు ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో ఇంటింటికి రేషన్ సరఫరాదారుడు మొండికేశాడు. నావద్దకే మీరు రావాలి. నేను ఇంటింటికి తిరిగి రేషన్ ఇచ్చేది…లేదు. మీరు సీఎంకు చెప్పుకుంటే చెప్పుకోండంటూ…లబ్దిదారులతో వ్యవహరించిన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను ప్రతిపక్షాలు అస్త్రంగా మలచుకున్నాయి.
రూ.1800 కోట్లు వృధా..
ఇంటింటికి రేషన్ సరఫరాకు వందల కోట్లు ఖర్చుచేసి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న బుర్ర తక్కువ నిర్ణయం ఫలితాలు ఎలా ఉన్నాయో చూశారా అంటూ టీడీపీ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది. ఇంటింటికి రేషన్ బియ్యం ఇచ్చేది లేదు, సీఎంకు చెప్పుకుంటారా, ఎమ్మెర్వోకు చెప్పుకుంటారా మీ ఇష్టం అంటూ వాహనదారుడు రుసరుసలాడే వీడియో హల్ చల్ చేస్తోంది.
Must Read ;- అప్పులు చేయడంలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్.. ఎంపీ రఘురామకృష్ణంరాజు
వందల కోట్ల ప్రజాధనం తగలేసి పాలకులు చేసిన బుర్ర తక్కువ పనులకు ఫలితం చూసారా? తమకేదో ఒరగపెడతారనుకుంటే చివరికి "నీకు దిక్కున్నోడికి చెప్పుకో పో" అన్న మాటలతో ప్రజలు అవమానాలు పడాల్సివస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం, లింగాలపాడు గ్రామంలో ఇంటింటికీ డోర్ డెలివరీ పథకం తీరు ఇది pic.twitter.com/JrcpUwMbbQ
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) April 5, 2021