ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పాలనపై చెన్నై కు చెందిన ఓ సంస్థ సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాలు మాత్రం వైసీపీ అధినేతకు నిద్రపట్టకుండా చేస్తున్నాయట. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారంతో జనం 151 సీట్లు కట్టబెట్టారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల్లో 90 మంది కొత్తవారే. వారిలో చాలా మందికి రాజకీయ నేపథ్యం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి చరిష్మాతో వారంతా గెలిచి ఎమ్మెల్యేలయ్యారు.
వారితోనే వచ్చింది అసలు సమస్య
ఎమ్మెల్యేలు అయ్యాక కూడా కనీసం నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు వారు ప్రయత్నం చేయడం లేదట. సర్వేలో మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే ఎవరు అంటే 87 శాతం మంది జనం వారి ఎమ్మెల్యేల పేరు చెప్పలేకపోయారట. ఇక వారి పనితీరు గురించి ప్రశ్నించిన సర్వే సంస్థకు అనూహ్య సమాధానాలు వచ్చాయట. అసలు మా ఎమ్మెల్యే ఎవరో తెలియదు. ఇక వారు కనిపిస్తే గదా? వారి పనితీరు గురించి తెలిసేది? అని జనం ఎదురు ప్రశ్నలు వేశారట?
Must Read: టీడీపీ కీలక నేతతో వైసీపీ ఎంపీ మిలాఖత్!
ఇప్పడు ఎన్నికలు జరిగితే సగం మంది కూడా గెలవరు
ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజల అభిప్రాయం తెలసుకునేందుకు చెన్నై సంస్థ చేసిన ప్రయత్నంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 90 మంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలిచే పరిస్థితి లేదని తేల్చారు. దీంతో వైసీపీ అధినేత మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించాలని నిర్ణయించారట. కేవలం ఎమ్మెల్యేలే కాదు, పది మంది మంత్రులు కూడా నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారట. వారు కూడా ఇప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచే పరిస్థితి లేదట.
ఎవరికి వారే యమునాతీరే?
వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది. సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదని తేలింది. కొందరు ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నారట. ఇక తిరిగి ఏం ప్రయోజనం అని వారు కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని సర్వే ఫలితాలు వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరి వ్యాపారం వారు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారని కూడా సర్వేలో తేలింది. దీంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారట. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి పనితీరుకు మార్కులు వేయాలని ఆదేశించారట.
టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారు?
టీడీపీలో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వారి నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు రగిలిపోతున్నాయని సర్వే తేల్చింది. టీడీపీ వారికే మరలా పనులు అవుతున్నాయని, టీడీపీ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, వైసీపీ అధికారంలోకి వచ్చినా మరలా మాకు తిప్పలు తప్పడం లేదని, ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదనతో రగిలిపోతున్నారని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అందుకే టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీలోకి వచ్చిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కూడా అధినేత నిర్ణయించారట. ఇక సర్వే ఫలితాల ఆధారంగా, వచ్చే నెలలో పార్టీని పటిష్టం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది.
Also Read: వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నాట్ట! ఎందుకో తెలుసా?