ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని గుడివాడలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2 కరోనా కేసులున్నప్పుడు ఎన్నికలు నిర్వహించలేని దద్దమ్మ, నేడు ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన విరుచుకుపడ్డారు.
60 ఏళ్లకు పదవీ విరమణ చేయాల్సిన వ్యక్తి చంద్రబాబునాయుడి సంకనాకి ఎన్నికల కమిషనర్ అయ్యాడని, మరో నాలుగు నెలలు పద్దతిగా ఉండి ఇంటికి పోవాలని కొడాలి నాని హితవు పలికారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దంగా లేదని, ఈ విషయం సీఎస్ ఇప్పటికే చెప్పారని ఆయన వెల్లడించారు.
నిమ్మగడ్డకు బుద్ది జ్ఞానం లేదా?
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు బుద్ది జ్ఞానం లేదని మంత్రి కొడాలి ధ్వజమెత్తారు. నాలుగు నెలల తరవాత పదవీ విరమణ చేసి, టీడీపీలో చేరి ఎక్కడైనా పోటీ చేసి నిమ్మగడ్డ గెలవాలని ఆయన సవాల్ విసిరారు. రాజ్యాంగ వ్యవస్థలను నిమ్మగడ్డ భ్రష్టు పట్టించారని కొడాలి తీవ్ర పదజాలంతో దూషించారు. చంద్రబాబునాయుడు చెప్పినట్టు నిమ్మగడ్డ ఆడుతున్నాడని వారి ఆటలు సాగవని కొడాలి హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు వేలల్లో ఉంటే ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
Also Read: సెంటిమెంట్ : గుడివాడ నుంచి మంత్రి ఉంటే.. ఆ ప్రభుత్వం కూలినట్టే!
గవర్నర్ ను కలసిన నిమ్మగడ్డ
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపామని, ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించేలా చూడాలని నిమ్మగడ్డ గవర్నర్ కు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. తాజాగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, పొరుగు రాష్ట్రం హైదరాబాద్ ఎన్నికలు నిర్వహిస్తోందని నిమ్మగడ్డ గవర్నర్ బిశ్వభూషన్ కు వివరించారని సమాచారం. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించడానికి ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరపడం రాజ్యాంగపరమైన అవసరంగా ఆయన తెలిపారని సమాచారం. ఎన్నికలు వెంటనే నిర్వహించకపోతే 15వ ఆర్థికసంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ, గవర్నర్ కు వెల్లడించారని తెలుస్తోంది. అయితే దీనిపై గవర్నర్ ఎలా స్పందించారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.
కొడాలి నాని పూర్తిగా ఏమన్నారో చూడండి :