పశ్చిగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ భార్య ఆండాలు అనుమానాస్పదంగా చనిపోయారు. ఆమె శవాన్ని వేలివెన్ను లాకుల వద్ద కాలువలో పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామునే బయటకు వచ్చిన ఆండాలు వెంట కుక్కలు పడ్డాయని, ఈ క్రమంలో ఆమె కాలువలో దూకి ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇటీవల మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన భూపతి ఆదినారాయణ పెద్ద ఎత్తున అప్పులు చేసి ఎన్నికల్లో ఖర్చు చేశాడని, దీంతో కుటుంబంలో వివాదాలు తలెత్తాయని భావిస్తున్నారు. ఈ వివాదాల వల్ల ఆండాలు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తెలుస్తోంది.
Suspicious Death of Nidadavolu Municipal Chairman’s Wife :
హత్యా? ఆత్మహత్యా?
నిడదవోలు మున్సిపాలిటీ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ భార్య ఆండాళ్లు కాలువలో పడి చనిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆండాళ్లు మృతిపై అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తెల్లవారు జామునే ఆండాలు అసలు ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందనే అనుమానాలు వస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:దొంగ ఓటు వేసిన మున్సిపల్ ఛైర్ పర్సన్‌పై క్రిమినల్ కేసు..











