రాజకీయ పార్టీ ఏర్పాటుపై తలైవా రజినీకాంత్ వెనక్కు తగ్గారు. ఇప్పట్లో పార్టీ ప్రకటన చేయబోవడం లేదని, అందుకు తన ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన ప్రకటించారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను ఆయన విడుదల చేశారు. రాజకీయాల్లోకి రాకుండానే ప్రజాసేవ చేస్తానని కూడా రజినీ ప్రకటించారు.
ఈనెల 31న రజినీకాంత్ తన పార్టీ కి సంబంధించిన అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈలోగా అన్నాత్తే షూటింగ్ నిమిత్తం హైదరాబాదులో ఉండిపియన రజినీకాంత్.. హైబీపీతో అనారోగ్యం పాలయ్యారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చారు గానీ.. ఇంకా విశ్రాంతిలోనే ఉన్నారు. మరో మూడురోజుల చికిత్స తర్వాతే ఆయన చెన్నై వెళ్లనున్నారు.
రజినీ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని ఎదురుచూసిన అభిమానులకు ఇది నిరాశ. అందుకోసం ఆయన అభిమానులకు సారీ కూడా చెప్పారు. ఈ ప్రకటనతో ఇక రజినీకాంత్ రాజకీయ పార్టీ ఆలోచన ఆగిపోయినట్టే. రాజకీయాల్లోకి రాకుండా ప్రజాసేవ అంటే.. ఆయన ఏదైనా ఇతర పార్టీలకు మద్దితిస్తారా, అసలు రాజకీయ జోక్యమే పట్టించుకోకుండా సేవా కార్యక్రమాల్లో మాత్రం ఉంటారా? అనేది బోధపడడం లేదు.
Must Read ;- సూపర్ స్టార్ రజినీకాంత్ ముందు ప్రశ్నలే ప్రశ్నలు