పగలు ఓ రకంగా.. చీకటి పడ్డ తర్వాత ఇంకో రకంగా మారిపోయే మనుషులున్నారు. చీకట్లో వారి ప్రవర్తనలు ఎలా మారిపోతుంటాయి అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని “స్ట్రీట్ లైట్”.పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి తాన్యా దేశాయ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, సీనియర్ నటుడు వినోద్ కుమార్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. విశ్వ దర్శకత్వం వహిస్తున్నారు.. మూవీ మాక్స్ సమర్పణ లో మామిడాల శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో,తయారవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి.

ఈ సంధర్భంగా నిర్మాణ సారథి మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కరోనా నిబంధనలకు లోబడి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేశాం. ఇందులో భాగంగా ఒక భారీ స్ట్రీట్ లైట్ సెట్ కూడా వేసి, అందులో చిత్రీకరణ జరిపాం. ఇలాంటి తరుణంలో కూడా కేవలం రెండు షెడ్యూల్స్ లో 45 రోజులలో షూటింగ్ పూర్తి చేశాం. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తాం“ అని అన్నారు.
దర్శకుడు విశ్వ మాట్లాడుతూ, స్ట్రీట్ లైట్ కింద ఒక రాత్రి జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సహజత్వానికి చాలా దగ్గరగా చూపిస్తూనే, థ్రిల్ కి గురిచేసేవిధంగా మలిచాం. కామెడీని కూడా సన్నివేశాలకు అనుగుణంగా మేళవించాం“ అని చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో షకలక శంకర్, ధనరాజ్త్, చిత్రం శ్రీను, అంకితరాజ్, డాక్టర్ పరమహంస, వైభవ్, బాలాజీ నాగలింగం, కావ్య రెడ్డి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సంగీతాన్ని యు ఎల్ వి ప్రద్యోధన్, రవి కుమార్ నీర్ల సినెమాటోగ్రఫీని, ఎడిటింగ్ ను శివ వై.ప్రసాద్ అందింస్తుండగా.. మాటలు, పాటలను విష్ణుశర్మ సమకూర్చారు.











