ఎన్టీఆర్ ఒక మనిషి కాదు.. ఆయనో చరిత్ర అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి అన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతిని పురస్కరించుకుని ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. ఆయన ఇన్ స్పిరేషన్ తో ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుడు ముందుకు సాగాలని, ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ‘‘ఎన్టీఆర్ గారి జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదు. ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠం. ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా, అసాద్యుడిగా, చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నారు ఎన్టీఆర్. అన్ని వర్గాల వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
Must Read ;- అభిమానుల గుండెల్లోనే ‘ఎన్టీఆర్’ గుడి
సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి.బడుగు వర్గాలకు అన్నివిధాలా అండగా నిలిచి,వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషిచేద్దాం(2/2)#JoharNTR
— Lokesh Nara (@naralokesh) May 28, 2021










