రామ్ గోపాల్ వర్మ… ఎప్పుడూ ఏదో ఒక రాద్దాంతం చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంటాడు. తరుచుగా ఎవరో ఒకరి మీద ట్విట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. అందుకే చాలామంది ‘ఆర్జీవి.. ఆయనో వింతజీవి’ అని అంటున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మ టీడీపీపై, ఆ పార్టీ నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా నారా లోకేష్‌ను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ కామెంట్స్ ను తిప్పికొడుతూ టీడీపీ ఫైర్ బ్రాండ్ దివ్యవాణి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
లోకేష్ సత్తా ఎంటో తెలుసుకో..
‘‘లోకేష్ సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగా 420 పనులేవీ చేయట్ల. నీకు Paytm అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు టీడీపీ కోసం నేను ఎప్పుడైనా సేవ చేయడానికి రెడీగా ఉంటాను అని. నీ నారదుడి సలహా ఆయనకు అక్కర్లా, ఎప్పుడేమి చేయాలో ఎన్టీఆర్ గారికి తెలుసు. నీకు తాగిన ఓడ్కా మత్తు దిగదేమో.ఇలాగే తాగి వాగితే మా టీడీపీ సైనికులు నీకు ఏదో రోజు దేహశుద్ధి చేయక తప్పదు. తస్మాత్ జాగ్రత్త’’ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.
Must Read ;- జగన్‌పై ప్రేమతో.. ఆర్జీవీ ట్వీట్లను జనం నమ్ముతారా?
@naralokesh సత్తా ఏంటో గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఎన్ని అవార్డ్స్ వచ్చాయో చూస్తే తెలుస్తుంది. నీలా ,నీవు వత్తాసు పలుకుతున్న జాంబిరెడ్డి లాగ 420 పనులేవీ చేయట్ల.నీకు Paytm అనే పిచ్చికుక్క కరిసినట్లుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు.(1/1) https://t.co/tTO8Z5zWDI
— DivyaVani (@divyavani_Offi) April 21, 2021











