వకీల్ సాబ్ పై ఆర్జీవీ చేస్తున్నవి ట్వీట్లు అనుకోవాలో తిట్లు అనుకోవాలో అర్థం కావడం లేదు. ఆయన ట్వీట్లన్నీ వ్యంగ్యాస్త్రాల్లేనే ఉంటాయి. కారోనా పాజిటివ్ తో ప్రశాంతంగా పడుకున్న పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ ఇలాంటి ట్వీట్లు చేయడం అవసరమా? అనుకోవాల్సి వస్తోంది. పైగా తాను పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఈ ట్వీట్లు చేస్తున్నట్లు ఆర్జీవీ సాబ్ చెబుతున్నారు. జనసేనానిపై ఆర్జీవీ చేస్తున్న ఈ ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి. ఇటు పవన్ ఫ్యాన్లు, అటు ఇతర హీరోల ఫ్యాన్లు కూడా ఆర్జీవీపై గుర్రుగా ఉన్నారు.
ఒకటా రెండా దాదాపు ఐదు ట్వీట్ల అస్త్రాలు ఆర్జీవీ సంధించారు. ‘ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కళ్యాణ్ ను ఇలాంటి దయనీయమైన స్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా? లేనట్టా? చెప్పండి యువరానర్?’ అంటూ సెటర్ విసరడంతో ఆర్జీవీ ట్వీట్లు ప్రారంభమయ్యాయి. కరోనాకు పవర్ స్టార్ అయినా, ఆర్జీవీ అయినా ఒక్కటేనన్న విషయం ఆయనకు తెలియక ఇలాంటి ట్వీట్ చేశారా? అనుకోవలసి వస్తోంది. అని అనిపించుకో అత్తా నీకు ఆరు నాకు మూడు అనే సామెత ఉండనే ఉంది. హీరో అనే ఇమేజ్ నే దెబ్బతీసేలా ఆయన ట్వీట్ ఉంది.
ఒక విధంగా పవన్ అభిమానులను కూడా ఆయన గిల్లారు. ‘హే పీకే ఫ్యాన్స్.. చాలామంది వేరే హీరోల దగుల్భాజీ ఫ్యాన్ నా కొడుకులు పవన్ కళ్యాణ్ ఇలా మంచాన పడటానికి కారణం కోవిడ్ కాదు వకీల్ సాబ్ కలెక్షన్లు అంటున్నారు. రండి.. కదలండి.. ప్రాణాలకు తెగించి పీకే జేబుల్ని నింపండి’ అంటూ మరో ట్వీట్ చేశారు. పీకే ఫ్యాన్స్ ఎలాంటి వారో తెలిసి కూడా ఆర్జీవీ ఇలా వెటకారంగా ట్వీట్ చేయడం ఎందుకో అర్థంకాదు. మీడియాకు విడుదలైన పవన్ కళ్యాణ్ ఫొటోపై కూడా ఆర్జీవీ స్పందించారు. పవన్ ఫొటో అలా ఏర్పాటు చేసిన ఆర్ట్ డైరెక్షన్ లో ఏదో లోపం ఉందన్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు శిరిల్ ను అడిగి అయినా ఆ తప్పేంటో చెప్పించాలని డైరెక్టర్ రాజమౌళిని కోరుతూ మరో ట్వీట్ చేశారు.
ఆ తప్పును గుర్తించి బయటపెట్టిన వారి ఫొటోను తాను పెట్టి మంచి బహుమతి ఇస్తానని కూడా ఆయన ప్రకటించారు. ఇక ఆయన తాజా ట్వీట్ ఏంటో చూద్దాం. ‘ఫేక్ అని నేను అనడంలేదు. వేరే హీరోల దగుల్భాజీ ఫ్యాన్స్ అంటున్నారు. వాళ్ల ఆట కట్టించడానికే పీకే ఫ్యాన్ గా ఆ ఛాలెంజ్ విసిరా’ అంటూ ట్వీట్ చేశారు. ఇలా పవన్ పైనే వరుసగా ఆర్జీవీ ట్వీట్లు చేస్తున్నారు. దీని కోసం ఆయన అమూల్యమైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. ట్వీట్ల వార్ ని పీకే ఫ్యాన్స్ స్వీట్స్ లా తీసుకుంటారా.. హాట్ గా రెచ్చిపోతారా అన్నది మనం చూడాలి. గిల్లడం వరకే పవన్ పని.. అవి వైరల్ అవడమే ఆయనకు కావాలి.. ఏం జరగబోతోందో మనం చూడాలి.
Must Read ;- ‘వకీల్ సాబ్’ కు కలిసొచ్చింది.. కలెక్షన్లు నడిచొస్తాయా?