నిరంకుశ పెత్తనం, అణచివేత, శ్రమ దోపిడీ ఎక్కువ కాలం సాగవని ప్రపంచానికి తెలియచెప్పిన రోజు మేడే అని నారా లోకేశ్ అన్నారు. త్యాగాలతో, పోరాటాలతో ప్రజలు సాధించుకున్న విశాఖ ఉక్కు వంటి పరిశ్రమలను కాజేయాలని చూసే రాష్ట్ర పెద్దలకు సరైన బుద్ది చెప్పాలన్నారు. మేడే స్ఫూర్తితో విశాఖ ఉక్కను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా మూలంగా ఆర్థిక కష్టాల్లో ఉన్న కార్మిక సోదరులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలను తెచ్చి ఉద్యోగాలు ఇచ్చినప్పుడే, కార్మిక సోదరులకు నిజమైన మేడే అవుతుందని నారా లోకేశ్ అన్నారు.
Must Read ;- పిట్టల్లా రాలుతున్నా పట్టింపు లేదా? జగన్ కాదు.. కంసుడు : నారా లోకేశ్ ఫైర్











