టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి నారా లోకేష్ అన్నారు. టీడీపీ కార్యకర్తలంటే వైసీపీ ప్రభుత్వం భయపడుతోందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య ఇటీవల సగం కట్టిన ప్రహరీ గోడను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ విషయాన్ని అక్కడి టీడీపీ కార్యకర్త మణిరత్నం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మణిరత్నంపై పోలీసులు కేసు నమాదు చేసి అరెస్టు చేశారు. అతని అరెస్టుకు కారణమైన వీడియోను లోకేష్ ట్వీట్ చేసి అందులో అతని తప్పేమిటని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు చెప్పినట్లు అక్రమ అరెస్టులు చేస్తే పోలీసులకు తర్వాత కష్టాలు తప్పవన్నారు.బాధిత టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామని లోకేష్ తెలిపారు.
Must Read ;- వీధి గుండాల్లా వైసీపీ నాయకుల బాహాబాహీ
.@ysjagan పిరికితనాన్ని బయటపెట్టింది.మణిరత్నం పెట్టిన పోస్ట్ లో తప్పేంటో అరెస్ట్ చేసిన పోలీసులు చెప్పాలి.వైకాపా నాయకులు ఆడమన్నట్టు ఆడుతున్న కొంతమంది పోలీసులు ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేది ఏమి ఉండదు ప్రతిగా కష్టాలు కొనితెచ్చుకోవడం తప్ప.(2/2)
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 25, 2020