మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల నిర్వహిస్తోన్న ‘యువర్ లైఫ్’ అనే కార్యక్రమానికి కన్నడ బ్యూటీ రష్మికా మందన్న గెస్ట్ ఎడిటర్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్మిక తనకు వచ్చిన వంటకాల్ని ఉపాసనతో కలిసి వండుతూ.. ప్రేక్షకులకు రెసిపీ కూడా చెబుతూ.. జోరు చూపిస్తోంది. తాజా ఎపిసోడ్ లో చికెన్ పుట్టు కర్రీని వండి.. మంచి పేరు తెచ్చుకుంది రష్మికా బేబ్. ఈ సందర్భంగా ఉపాసన వచ్చింది. బాగా వంట చేసే అమ్మాయి భార్యగా రావాలనుకొనే వారికి రష్మికా బెస్ట్ ఆప్షన్ అని సరదాగా చెప్పింది.
ఇక తాజాగా రష్మికా తన సామాజిక వర్గం కోర్గి గురించి చెప్పింది. కర్నాటకలోని కొడుగు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన రష్మికా.. తనది కోర్గి తెగ అని.. తాము పందిమాంసాన్ని ఇష్టంగా తింటామని, అది తమ సాంప్రాదాయక వంటకమని చెప్పి.. అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు పందిమాంసాన్ని నేరుగా కాల్చి తింటూ వైన్ తాగడం తమ సాంప్రదాయంలో ఒక భాగమని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పింది. అంతేకాదు తమ ఇంట్లోని వారు ఎవరికి వారు వైన్ తయారు చేసుకొని మరీ తాగుతామని కూడా చెప్పింది.
Must Read ;- అఖిల్ సరసన కన్నడ బ్యూటీ ఖాయమైందా?











