విజయనగరం జిల్లా ఇన్చార్జి మంత్రి , రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ .. టీడీపీ పోలిట్బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం పెద్ద ఎత్తున నిరసన, ర్యాలీ నిర్వహించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, అశోక్ బంగ్లా నుండి స్థానిక మయూరి కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అందుకు బాధ్యత వహించి మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అశోక్ గజపతి రాజుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు భేషరతుగా వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీటీడీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హస్తినలో లోకేష్ హవా.. అమిత్ షా ఫిదా..!
హస్తిన పర్యటనలో బిజిబిజీగా ఉన్నారు మంత్రి నారా లోకేష్. వరుస సమావేశాలతో ఆయన...