బీజేపీ కండువా కప్పుకున్న తీన్మార్ మల్లన్న ..!
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు 38 కేసులు, 74 రోజుల జైలు జీవితం ఎన్నో నేర్పింది. ఆ పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ మల్లన్న కుటుంబాన్ని ఆదుకుని, అక్కున చేర్చుకుంది. జైలు నుంచి నవంబరులో బయటకు వచ్చిన మల్లన్న తనదైన శైలిలో కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తునే .. బీజేపీకి ఇంకా దెగ్గరయ్యారు. అందరూ ఊహించినట్లే బీజేపీ తెలంగాణ వ్యవహరాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ ధర్మపురి అరవింద్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో ఢిల్లీ వేదికగా మల్లన్న బీజేపీలోకి చేరారు. అనంతరం మల్లన్న మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు. కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ అమరవీరుల స్థూపానికి కట్టేసి .. అమరవీరుల తల్లిదండ్రులతో కొట్టిస్తానని హాట్ కామెంట్స్ చేశాడు. రాష్ట్రంలో ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారని, ఇక కేసీఆర్ పై సాగించేది యుద్ధమేనని చెప్పారు. ఇదిలా ఉంటే గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మల్లన్న ఒకస్థాయిలో ఓట్లు సాధించారు. ఇప్పటికే మాజీ మంత్రి ఈటెల బీజేపీలో కీ రోల్ పోషిస్తూ పార్టీకి అదనపు బలాన్ని చేకూరితే .. ఇక మల్లన్న చేరికతో తెలంగాణలో బీజేపీ మరింత శక్తివంతంగా మారబోతున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- రాజధాని ’అమరావతే‘.. బీజేపీ నినాదం!










