తెలంగాణలో రేపటితో లాక్ డౌన్ ప్రక్రియ ముగియనుంది. లాక్ డౌన్ పొడిగించాలా? వద్దా? ఏమైనా సడలింపులు ఇవ్వాలా? అనే విషయాలపై ఇవాళ (మంగళవారం) తెలంగాణ క్యాబినెట్ భేటీ కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశం కానుంది. కరోనా కేసులు కొంతవరకు తగ్గుతుండటంతో ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇచ్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎప్పటిలాగే నైట్ కర్ఫ్యూను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఈ భేటీలో పీఆర్సీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా థర్డ్ వేవ్ గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి.
Must Read ;- పిల్లలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.. కరోనా థర్డ్ వేవ్‌పై కేటీఆర్ సూచనలు











