పశ్చిమ బెంగాల్‌లో సోమవారం పిడుగులతో కూడిన వర్షం పడటంతో 26 మంది మృత్యువాత పడ్డారు. ఐదు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ముర్షీదాబాద్‌లో 9 మంది,హుగ్లీ జిల్లాల్లో 11 మంది , తూర్పు, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాల్లో ఇద్దరేసి, బంకురాలో ఇద్దరు పిడుగులు పడి చనిపోయారు.ఈ సంఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
Must Read ;- అందరికీ ఉచితంగా వ్యాక్సిన్.. మోదీ ప్రకటన