తెలుగు సినీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన పలు వరాలు పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయని నటుడు, `మనం సైతం` కాదంబరి కిరణ్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తూ, అందులో భాగంగా ఈ వరాలను ప్రకటించిన కేసీఆర్ కు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.
హైదరాబాద్ ను సినీ హబ్ చేయాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్ పరిసరాలలో 1500 ఎకరాలను కేటాయిస్తామని చెప్పడంతో పాటు చిన్న నిర్మాతలు చెల్లించే జీఎస్టీలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాను తిరిగి వారికే రీ ఎంబర్స్ మెంట్ చేస్తామని ప్రకటించడం ఆనందదాయకం. అలాగే థియేటర్లకు ఆరు నెలల పాటు కరెంటు బిల్లులు రద్దు చేయడం వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుంది. పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో పనికివచ్చే ఇలాంటి వరాలను ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదని అన్నారు.
1500 ఎకరాలలోనే సినీ పరిశ్రమనే నమ్ముకుని బ తుకుతున్న వేలాది మంది కార్మికులకు సొంత గృహ వసతి కల్పించినట్లయితే వారికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. జీఎస్టీ రీ ఎంబర్స్ మెంట్ వల్ల చిన్న నిర్మాతలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఒక చిత్రం విడుదల చేసిన వెంటనే మరో చిత్రాన్ని వారు మొదలు పెట్టుకునే అవకాశం దీనివల్ల కలుగుతుంది. పేద ప్రజల పక్షాన నిల్లవడంతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న కేసీఆర్ సారథ్యంలోని తెరాస పార్టీకి నా మద్దతు తెలియజేస్తున్నాను. కేటీఆర్ పైన, అలాగే తలసాని అన్న, సంతోష్ అన్న పైన మాకు ఎంతో నమ్మకం ఉంది. కేసీఆర్ కు అభివృద్ధిలో బాసటగా నిలిచి వారు ఏంతో సహకరిస్తున్నారు. అందుకే తెరాస పార్టీకి మద్దతు పలుకుతూ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఓటు వేయాల్సిందిగా అందరినీ సవినయంగా కోరుతున్నాను అని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో రాజేశ్వర్ రెడ్డి, సురేష్, లలిత తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- సీఎం కేసీఆర్ కు నిర్మాతల మండలి ధన్యవాదాలు