అందం ఆనందాన్ని ఇస్తుంది .. అనుభూతుల లోకంలో విహరింపజేస్తుంది. అలాంటి అందం ఎక్కడ ఉన్నా ప్రశంసలు వెతుక్కుంటూ వస్తాయి .. అభినందనలు దక్కుతుంటాయి. అందాల పోటీల్లో మెరిసే అమ్మాయిలను చూసినప్పుడు, ఒకరికంటే ఒకరు అందగత్తెలుగా కనిపిస్తారు .. అప్సరసలను సైతం మరిపిస్తారు. అయితే అందాల పోటీల్లో విజేతలుగా నిలవాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆ అర్హతలను బట్టే విజేతలను ప్రకటిస్తారు.
అలా 2020 సంవత్సరానికిగాను ‘ఫెమీనా మిస్ ఇండియా’ పోటీలలో ‘మానస వారణాసి’ టైటిల్ గెలుచుకుంది. ఇక్కడ ఈ ఫొటోలో తళతళమనీ .. మిలమిలమని మెరిసిపోతున్న అమ్మాయి ఆమెనే. మానస తెలంగాణ – హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కావడం విశేషం. రవివర్మ గీసిన బొమ్మలా .. నాజూకుతనానికి నమూనాగా కనిపిస్తున్న ఈ అమ్మాయి వయసు 23 ఏళ్లు. ‘వాసవీ ఇంజనీరింగ్ కళాశాల’లో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఈ అమ్మాయి, ప్రస్తుతం ఫైనాన్షియల్ ఎక్సేంజ్ అనలిస్ట్’గా పనిచేస్తోంది.
సాధారణంగా అందాల పోటీలో విజేతలుగా నిలిచినవాళ్లు మోడలింగ్ వైపు మొగ్గుచూపడం, అదే సమయంలో సినిమాలపై దృష్టి పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందాల చందమామలా కనిపిస్తున్న మానసలో, ఒక హీరోయిన్ కి కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. యంగ్ స్టార్ హీరోల జోడీగా ఈ అమ్మాయి పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మరి మానస యాక్టింగ్ వైపు వస్తుందా? లేదంటే జాబ్ లోనే కంటిన్యూ అవుతుందా? అనేది చూడాలి.
Must Read ;- అనసూయకు అరుదైన గౌరవం నెటిజన్లకు షాక్..











