కృష్ణా నదీ నీటియాజమాన్య బోర్డును విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బ్రేకులు పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ సారి ప్రభుత్వ నిర్ణయానికి పడుతున్న బ్రేకులు కోర్టు వైపు నుంచి కాదు- జగన్మోహన్ రెడ్డి తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిఉండే పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు నుంచి! అదే మరి ట్విస్టు! కృష్ణా నదీ నీటియాజమాన్య బోర్డు ను విశాఖలో ఏర్సాటు చేయవద్దని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఈ.ఎన్.సీ మురళీధర్ రావు రాసిన లేఖలో విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరాలు తెలిపారు. కృష్ణా నదికి సంబంధించిన యాజమాన్య బోర్డును, అసలు నదితో ఎంతమాత్రమూ సంబంధం లేని ప్రాంతంలో ఏర్పాటు చేయడం తగదని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బోర్డును విజయవాడలో ఏర్పాటు చేస్తామని అన్నందుకే గతంలో తాము ఒప్పుకున్నామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
సంబంధం లేని ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేయడం వల్ల కార్యకలాపాలకు ఇబ్బందులు తలెత్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆ లేఖలో వివరంగా పేర్కొంది. అపెక్స్ కమిటీ లో చర్చించకుండా ఇప్పుడు విశాఖ లో ఏర్పాటు చేస్తామనడం సరైంది కాదని వారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Also Read ;- ఒక్కొక్కటిగా విశాఖను వీడుతున్న కంపెనీలు
ప్రభుత్వ వ్యూహానికి ఇది చెక్!
కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్టణంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల అనేక వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయినా, ప్రభుత్వం పట్టించుకోలేదు. తద్వారా.. రాష్ట్ర స్థాయి కార్యాలయాలు అన్నీ.. విశాఖలోనే ఏర్పాటు అవుతాయని.. విశాఖ త్వరలోనే రాష్ట్రానికి పూర్తి
స్థాయి రాజధానిగా అవతరించబోతున్నదని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా తెలంగాణ సర్కారు వేసిన బ్రేకులతో ఇది ఆగే అవకాశం కనిపిస్తోంది.
మరి తన నిర్ణయమే ఫైనల్ అని, అందులో మార్పు చేర్పులు ఉండవని నిరూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తారో చూడాలి.
Must Read ;- ఉగాది నాటికి రాజధాని విశాఖకు తరలింపు