ఢిల్లీ లో రైతు చట్టాల కు వ్యతిరేకుందా పోరాడి ప్రాణ త్యాగం చేసిన వారి కుటుంబాలను పరామర్శించి,ఆర్థిక సాహయం చేయడం తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పది లక్షల రూపాయలు అందించడం రాష్ట్రం లో చర్ఛాంశం గా మారింది. రాష్ట్రం లో ప్రతి పక్షాలతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతులు టీఆర్ఎస్ ను నిలదీసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే ప్రతిపక్ష నేత ఎంపీ రేవంత్ రెడ్డి మాటల తూటాలను పేల్చారు. అయినవారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అన్నసామెత సీఎం కేసీఆర్ కు సరిపోతుందని ఎద్దేవ చేశారు.
రాష్ట్రంలో రోజుకు ముగ్గురు రైతులు ఆర్ధిక, ఇతర సమస్యల తో ప్రాణాలు తీసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్ని ఆయినా పరామర్శించారని సూటిగా ప్రశ్నించారు. పంజాబ్ లో మృతి చెందిన రైతు కుటుంబాలు ఎక్కువయ్యాయా అని నిలదీశారు. సీఎం కేసీఆర్ రాష్ట్రం లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు గుర్తుకు రావడంలేదాని ప్రశ్నించారు.
రాష్ట్రంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా కూడా అధికార పార్టీ నేతలు, సీఎం కేసీఆర్ ఎవ్వరు స్పందించలేదు. కనీసం వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దాఖాలు లేవు. కానీ ఢిల్లీ పర్యటనలో భాగంగా పంజాబ్ వెల్లిన ఆయన ఆక్కడ రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేయడం పై చర్చించుకుంటున్నారు.
సౌత్ కొరియాలో లోకేష్ బిజీ బిజీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం..
ఏపీని పారిశ్రామికంగా, సాంకేతికంగా అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్,...










