అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ఐకాన్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా. ఈ సినిమాకు సంబంధించి 2 రోజులుగా సోషల్ మీడియాలో ఓ గాసిప్ రౌండ్స్ కొట్టింది. అదేంటంటే.. ఈ సినిమాలో అల్లు అర్జున్అం ధుడిగా కనిపిస్తాడనే మేటర్. ఊహించని విధంగా ఐకాన్ సినిమాకు సంబంధించిన మేటర్ బయటకు రావడంతో యూనిట్ ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది. తెలిసిన వాళ్లందరికీ ఫోన్లు చేసి ఈ వార్తను తొలిగించే కార్యక్రమం షురూ చేసింది.
దిల్ రాజు కాంపౌండ్ కు చెందిన వ్యక్తులకు ఎవరెవరికి ఏ ఏ కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్లంతా ఇప్పుడు రంగంలోకి దిగారు. తమకు తెలిసిన మీడియా వ్యక్తులందరికీ ఫోన్లు చేసి దగ్గరుండి ఐకాన్ కు సంబంధించిన వార్తల్ని డిలీట్ చేయిస్తున్నారు. అలా కొన్ని సైట్ల నుంచి ఇప్పటికే ఆ వార్త తొలిగిపోయింది. రేమాపోమా ప్రింట్ మీడియాలో రాకుండా, వాళ్లకు కూడా ముందస్తుగా సమాచారం అందించారు. ఇక ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన రిపోర్టర్లందరికీ పనిగట్టుకొని మరీ ఫోన్లు చేసి ఐకాన్ వార్త కవర్ కాకుండా జాగ్రత్త పడ్డారు.
అయితే ఈ మొత్తం వ్యవహారంతో నిన్నటివరకు గాసిప్ గా ఉన్న ఈ మేటర్ ఇప్పుడు కన్ ఫర్మ్ అయినట్టయింది. ఐకాన్ లో బన్నీ అంధుడిగా కనిపించబోతున్నాడనే మేటర్ పుకారు అయితే యూనిట్ పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. రోజూ ఎన్నో పుకార్లు వస్తుంటాయి. అందులో ఇది కూడా ఒకటి. ఐకాన్ యూనిట్ మాత్రమే కాదు.. ఇలాంటి పుకార్లను ఏ సినిమా యూనిట్ పట్టించుకోదు. పైపెచ్చు ప్రచారం జరుగుతోందంటూ లైట్ తీసుకుంటుంది. కానీ ఐకాన్ యూనిట్ మాత్రం అదే పనిగా రంగంలోకి దిగి మరీ ఈ పుకారును సోషల్ మీడియాలో లేకుండా డిలీట్ చేసే కార్యక్రమం మొదలుపెట్టిందంటే, ఈ పుకారులో కాస్త నిజం ఉందనే విషయం అర్థమౌతూనే ఉంది.
అయితే ఐకాన్ యూనిట్ గమనించాల్సిన అంశం ఏంటంటే.. సోషల్ మీడియాను ఆపడం ఎవ్వరి తరం కాదు. కొన్ని సైట్ల నుంచి సమాచారాన్ని తొలిగించినంత మాత్రాన ఈ మేటర్ గప్ చుప్ అయిపోదు. ఎన్నో ఫేస్ బుక్, ట్విట్టర్ పేజీల్లో, వ్యక్తిగత హ్యాండిల్స్ లో ఈ మేటర్ అలానే ఉంటుంది. రాబోయే రోజుల్లో గూగుల్ లో సెర్చ్ కొడితే మళ్లీ ఇవన్నీ వాటంతట అవే ప్రత్యక్షమౌతాయి. కాబట్టి ఇలాంటివి చూసీచూడనట్టు వదిలేస్తే అందరికీ మంచిది. లేదంటే మరింత రచ్చ అవుతుంది.
Must Read ;- ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ దారెటు?