తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించిన కథానాయిక ప్రియమణి. తన నటనతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం దక్కించుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమా అవకాశాలు కాస్త తగ్గినా… టీవీ షోల్లో మాత్రం బాగానే సందడి చేస్తుంది. ఇటీవల ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. విక్టరీ వెంకటేష్ సరసన నారప్ప సినిమాలో నటించింది. అలాగే రానా దగ్గుబాటి నటించిన విరాటపర్వం సినిమాలో కీలక పాత్ర పోషించింది. అయితే.. బాబాయ్ వెంకటేష్ – అబ్బాయ్ రానా సినిమాల్లో ప్రియమణి నటించడం విశేషం.
ఇదిలా ఉంటే.. తనని ట్రోల్ చేస్తున్న విషయం గురించి ప్రియమణి స్పందించింది. గతంలో తనని కర్ర ఆంటీ, ఫ్యాట్ పిగ్ అని కొందరు ఆకతాయిలు ఆన్ లైన్లో వేధించారనే విషయాన్ని బయట పెట్టి కలకలం రేపింది ప్రియమణి. జాతీయ ఉత్తమ నటి అవార్డ్ పొందిన ప్రియమణికి అలాంటి ట్రోలింగ్ జరిగిందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. దాంతో, మీడియా ఆమెని వరుసగా ఇంటర్వ్యూలు చేస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఒక ఇంటర్వ్యూలో తన డ్రీం రోల్ ఏంటనేది తెలిపింది. ఒక పాత్ర కోసం నిరీక్షణ తప్పడం లేదని చెప్పింది.
ఇంతకీ.. ఏంటా డ్రీమ్ రోల్ అంటే.. రజనీకాంత్ నరసింహా సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి తరహా పాత్ర చెయ్యాలనేది డ్రీమ్. నా బాడీ లాంగ్వేజ్, నా డైలాగ్ డెలివరీ పొగరుబోతు పాత్రలకు సరిగ్గా సరిపోతుంది. అందుకే, అలాంటి పాత్ర కోసం ఎదురు చూస్తున్నాను. అలాగే, పూర్తి స్థాయి విలన్ గా నటించాలనేది కోరిక అని ప్రియమణి చెప్పింది. మరి..ప్రియమణి కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.
Must Read ;- సమంత పాత్ర కొంపముంచేలా ఉంది!











