ఆనందయ్య.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందికి సుపరిచితం. తన ఆయుర్వేద మందుతో ఎంతోమంది కరోనా రోగులకు ఊపిరి పోశారు. నిర్విరామంగా ఆయుర్వేద మందును తయారీ చేస్తూ.. లక్షల మందికి పంపిణీ చేస్తున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను సైతం పక్కన పెట్టి ఆనందయ్య మందు కోసం జనం ఎగబడ్డారు. ఎన్ఆర్ ఐలు సైతం ఆనందయ్య మందును స్వాగతించారు. ఏపీ ప్రభుత్వం కనీస వసతులు ఏర్పాటు చేయడంలో విఫలమైనా.. ఆనందయ్య మాత్రం మందు తయారీని ఆపలేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఆనందయ్య పేరు మార్మోగుతోంది. యోగా గురువు బాబా రాందేవ్ కన్నా.. ఆనందయ్య ఎంతో బెటర్ అని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు.
మద్రాస్ హైకోర్టు అభినందనలు
ఆనందయ్య మందు క్షేత్రస్థాయిలో పంపిణీ అవుతుండటం.. ఏలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో ఆయుర్వేద మందుపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో ఉచితంగా కరోనా ముందు ఇస్తుండటంతో ఆనందయ్యను అభినందించింది. మందు సమర్థతపై, ఐసీఎంఆర్ నిర్వహిస్తున్న పరీక్షల స్థితి ఏంటి? అని మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కురుబాకరణ్ ప్రశ్నించారు. ఆనందయ్యకు ప్రభుత్వాలు సహకరించాలని తెలిపారు. ఇటీవల ఆనందయ్య వరల్డ్ బుక్ లో చోటు సంపాదించుకోగా.. మద్రాస్ హైకోర్టు అభినందనలు తెల్పడంతో మరోసారి ఆనందయ్య వార్తల్లోకెక్కారు.
Must Read ;- ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి.. మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు