టాలీవుడ్ కింగ్ నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన చిత్రం హలో బ్రదర్. ఇందులో నాగార్జున డూప్ గా ఓ ప్రముఖ హీరో నటించారు. ఆ హీరో ఎవరంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున కెరీర్ లో ఎప్పటికీ మరచిపోలేని చిత్రాల్లో ఒకటి హలో బ్రదర్. ఈ సినిమా ఎలా ప్రారంభం అయ్యిందంటే.. యువ సమ్రాట్ నాగార్జున – సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్ లో ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో వారసుడు సినిమా రూపొందింది. ఈ సినిమా విజయం సాధించింది. ఈ సందర్భంగా నాగార్జునను అభినందించడానికి వెళ్లిన ఇ.వి.వి సత్యనారాయణతో మనం కలిసి మరో సినిమా చేద్దాం. కథ రెడీ చేయండి అని చెప్పారట నాగార్జున. అప్పుడు ఏ సినిమా చేస్తే బాగుంటుందా అని ఆలోచించి ఇ.వి.వి సత్యనారాయణ హాలీవుడ్ మూవీ ట్విన్స్ డ్రాగన్ రీమేక్ చేద్దామనుకున్నారు. రచయితలు రమణి, ఎల్బీ శ్రీరామ్ లను సంప్రదించారు. మాస్, క్లాస్ మధ్యలో కామెడీ అన్నట్టుగా స్టోరీ రెడీ చేసుకున్నారు. ఆ కథ విని నాగార్జున, డా.కె.ఎల్.నారాయణ ఓకే అన్నారు.
డబుల్ యాక్షన్ మూవీస్ గతంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అయితే.. ట్విన్స్ లో ఒకరికి బాధ, సంతోషం కలిగితే.. మరొకరు ప్రతి స్పందించడం అనేది కొత్తగా అనిపించింది. నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్యలను ఎంపిక చేశారు. అప్పటి వరకు స్టార్ హీరోలతో నటించని సౌందర్యకు ఆలోటు ఈ సినిమాతో తీరింది. అలనాటి ప్రముఖ విలన్ రాజనాలను చిత్ర పరిశ్రమలో మరచిపోతున్న తరుణంలో ఈ మూవీలో మంచి వేషం ఇచ్చారు. ప్రతి నాయకుడు పాత్రలో తమిళ నటుడు నెపోలియన్ కొత్తగా కనిపించడం జరిగింది.
అన్నింటికి మంచి కోట శ్రీనివాసరావు, మల్లిఖార్జునల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ సినిమాను మరో లెవల్ కి తీసుకెళ్లింది. వారిద్దరూ కామెడీ చేస్తూ చివరికి ట్రాజిడీగా చేయడం సినిమాను ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అయ్యేలా చేసింది. అయితే.. సినిమాలో ట్విన్స్ గా నటించిన నాగార్జున ఒకే ఫ్రేమ్ లో కనపడడం ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే.. నాగార్జున డూప్ పాత్రలో ఎవరు నటించారు అనేది ఆసక్తిగా మారింది. ఇంతకీ ఎవరు నటించారంటే.. నాగార్జున పాత్రలో ప్రముఖ హీరో శ్రీకాంత్ నటించడం జరిగింది. ఈ విషయాన్ని ఓ సందర్భంలో స్వయంగా నాగార్జునే బయటపెట్టారు. అప్పటి వరకు ద్విపాత్రాభినయంతో వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు. హలో బ్రదర్ మరొక ఎత్తు. అందుకనే.. కొత్త తరహా కాన్సెప్ట్ తో వచ్చిన హలో బ్రదర్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది.
Must Read ;- ట్రైనింగ్ తీసుకుంటున్న నాగ్. ఇంతకీ.. ఏంటా ట్రైనింగ్.?











