నిన్న రాత్రి సరిగ్గా 7గంటల15 నిమిషాలకు మెగా డాటర్ నిహారిక కొణిదెల.. జొన్నలగడ్డ చైతన్య చేత మూడు ముళ్ళు వేయించుకొన్న సంగతి తెలిసిందే. కనీవినీ ఎరుగని రీతిలో రాజస్థాన్ ఉదయ్ ఫ్యాలెస్ మిరిమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతుల్లో పెళ్ళికూతురు దుస్తుల్లో చందనపు బొమ్మలా మెరిసిపోయింది నిహారిక.
Must Read ;- నిహారిక, చైతన్యలది.. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?
తండ్రి నాగబాబు, పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్.. అన్నలు వరుణ్ తేజ , రామ్ చరణ్ .. ఇంకా బావలు .. సాయిధరమ్ తేజ, వైష్ణవ్ తేజ .. నిహారిక వివాహ మహోత్సవాన్ని కళ్ళారా తిలకించి పులకించిపోయారు.
కోవిడ్ నిబంధనల్ని అనుసరిస్తూ.. సినీ రంగానికి చెందిన కొంత మంది ప్రముఖులతో పాటు, బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది వివాహం.
Also Read ;- కాబోయే జంట నిహారిక, చైతన్య డ్యాన్స్ – సోషల్ మీడియాలో వైరల్.
అయితే ఈ పెళ్లి ఫోటోస్ కోసం మెగాభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు.
నేటి నుంచి జొన్నలగడ్డ వారి కోడలైపోయిన నిహారిక పెళ్ళి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read ;- నిహారికకు 2కోట్లు ఖరీదు చేసే నగలను గిఫ్ట్ గా ఇచ్చిన పెదనాన్న
అందులో సాంప్రదాయపు దుస్తుల్లో ధగధగలాడుతోన్న మెగా హీరోల్ని చూసి మురిసిపోతున్నారు అభిమానులు.
Also Read ;- మెగా ఫ్యామిలీ ఇచ్చిన బహుమతుల విలువ తెలుసా.?