సినిమా థియేటర్లు రేపటి నుంచి ప్రారంభం కావడం లేదు. తెలంగాణ వరకు ఇంకా నిర్ణయం జరగకపోయినా ఏపీలో మాత్రం ఎగ్జిబిటర్లు థియేటర్లు తెరిచేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అధికారికంగా వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. కేంద్రం అక్టోబరు 15 నుంచి థియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల ఎగ్జిబిటర్లు బుధవారం విజయవాడలో సమావేశమయ్యారు. 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్ల నిర్వహణ కష్టమని ఎగ్జిబిటర్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభం ఎప్పుడో తెలిసేందుకు మరి కొన్ని రోజుల సమయం పట్టనుంది.
ఎన్టీఆర్ శతజయంతి కమిటీ కృషికి చంద్రబాబు ప్రశంసలు
నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో...