2020లో కరోనా రావడంతో.. అందరూ 2020 ఇయర్ ను తిట్టుకున్నారు. ఈ సంవత్సరం ఎప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూసారు. ఎందుకంటే.. కరోనా వలన ఉద్యోగం పోయి చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇంట్లోనే కూర్చొవల్సి వచ్చింది. అందువలన ఎప్పుడు ఈ సంవత్సరం వెళ్లిపోతుందా..? కొత్త సంవత్సరం వస్తుందా..? అని ఎదురు చూసారు. అయితే.. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రం 2020 మన జీవితంలో బెస్ట్ ఇయర్ అన్నారు. ఇదేంటి.? అందరూ 2020 ఇయర్ ని తిట్టుకుంటుంటే పూరి ఎందుకు ఇలా చెప్పాడనుకుంటున్నారా..?
విషయం ఏంటంటే.. మనకి ఆరోగ్యం ఎంత ముఖ్యమో చెప్పింది. మనలో సహనాన్ని పెంచింది. మన రియల్ ఫ్రెండ్స్ ఎవరో తెలియచేసింది. మనకి ఇమ్యూనిటీ పవర్ గొప్పతనం ఎలాంటిదో చెప్పింది. అలాగే హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పింది. పుట్టిన తర్వాత ఇన్ని సార్లు ఎవరూ హ్యాండ్ వాష్ చేసుకుని ఉండరు. ఉన్నోడు లేనోడు. పట్టణం.. పల్లెటూరు..ఆడ, మగ అనే లేకుండా అందరికీ శుభ్రత గురించి తెలియచేసింది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని పెంచింది. ఇలా.. 2020 చాలా మార్పులు తీసుకువచ్చింది.
అందుచేత మన లైఫ్ లో 2020 ఇయరే బెస్ట్ ఇయర్ అంటున్నారు. ఇక పూరి సినిమా విషయానికి వస్తే.. సెన్సేషనల్ హీరో విజయ్ దేరకొండతో ఫైటర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. పూరి – ఛార్మి – కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫైటర్ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.