August 15, 2026 9:30 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మ‌రీ ఇంత దిగ‌జారుడుత‌నమా?

ఏపీ రాజ‌కీయాల్లో విలువ‌లు ప‌త‌న‌మ‌వుతున్నాయి. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై నేత‌లు సంధిస్తున్న భాష‌, ఆరోప‌ణ‌లు గ‌తంలో ఎన్న‌డూ లేనంత రీతిలో దిగ‌జారిపోతున్నాయి. ఇందుకు చంద్ర‌బాబు ఫ్యామిలీపై వైసీపీ కీల‌క నేత స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్య‌లే నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పాలి.

October 6, 2021 at 11:47 AM
in Andhra Pradesh, Latest News, Politics, Top Stories
Share on FacebookShare on TwitterShare on WhatsApp

రాజ‌కీయాల్లో కొన‌సాగాలంటే హూందాత‌నం అవ‌స‌రం. అది లేని రాజ‌కీయాలు విలువ‌లు లేని రాజ‌కీయాల కిందే లెక్క‌. వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రు ఎవ‌రికీ శ‌త్రువులు కాన‌ప్ప‌టికీ.. కేవ‌లం రాజ‌కీయాల కోసం ప్ర‌త్య‌ర్థుల‌ను కించ‌ప‌రిచేలా, వారి గౌర‌వానికి భంగం క‌లిగేలా వ్యాఖ్య‌లు చేయ‌డం ముమ్మాటికీ త‌ప్పే. అలాంటి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల్సిందే. ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసిన వారు త‌మ త‌ప్పు తెలుసుకున్న త‌ర్వాత అయినా త‌మ వైఖ‌రి మార్చుకోవాలి. త‌ప్పును ఒప్పుకోవాలి కూడా. విప‌క్షంలో ఉన్న పార్టీల కంటే కూడా అధికార ప‌క్షంగా ఉన్న పార్టీల నేత‌ల‌కు ఈ త‌ర‌హా హుందాత‌నం మ‌రింత‌గా అవ‌స‌ర‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంశం ఏదైనా, సమ‌యం ఏదైనా, సంద‌ర్భం ఏదైనా కూడా.. ప్ర‌జ‌ల‌తో పాటు విప‌క్షాల్లోనూ అనుమానాలు రేకెత్తే ప్ర‌మాదం లేకుండా అధికార పార్టీలు ముందుగానే స్పందిస్తే.. అస‌లు స‌మ‌స్యే లేదు. అయితే ఏదో అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్న మాదిరిగా విప‌క్షాలు స్పందించేదాకా మౌన‌వ్ర‌తం పాటించి.. విప‌క్షాలు స్పందించాక అద‌ను చూసుకుని విరుచుకుప‌డటం మాత్రం స‌రికాద‌న్న‌ది అంద‌రి నోటా వినిపిస్తున్న మాట‌. అయినా ఇంతలా ఉపోద్ఘాతం చెప్పాల్సిన అవ‌స‌రం ఏమొచ్చిందంటారా? 14 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హరించిన టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడును, ఆయ‌న ఫ్యామిలీని ల‌క్ష్యంగా చేసుకుని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, జ‌గ‌న్ స‌ర్కారుకు ముఖ్య స‌ల‌హాదారుగా విధులు నిర్వ‌ర్తిస్తున్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మంగ‌ళ‌వారం నాడు చేసిన వ్యాఖ్య‌లు విన్న‌వారు ఎవ‌రైనా ఈ త‌ర‌హా వాద‌న‌ల‌నే వినిపిస్తారు.

స‌జ్జ‌ల ఏమ‌న్నారంటే..?

మంగ‌ళ‌వారం నాడు బ‌ద్వేల్ ఉప ఎన్నిక సంద‌ర్భంగా పార్టీ ప్ర‌చార పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన స‌జ్జ‌ల‌.. ఆ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకోకుండానే.. చంద్ర‌బాబు ఫ్యామిలీపై విరుచుకుప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల ఏమ‌న్నారంటే.. ‘‘ప్రభుత్వంపై ఒక వర్గం విష ప్రచారం చేస్తోంది. పండోరా లీక్స్ కు సీఎం జగన్ కు ఏంటి? ఏ రాష్ట్రంలో ఏమి జరిగినా దానిని ఏపీకి ముడిపెడతారా ? మొన్న హెరాయిన్, నేడు పండోరా ప్రభుత్వానికి ముడి పెట్టాలని చూస్తున్నారు. ఒక వర్గం దుష్ప్రచారం చేస్తే మరొక వర్గం దీనిని వెనకుండి నడిపిస్తుంది. టీడీపీ నేతలు అంతా సినిమా డైరెక్టర్లుగా మారారు. డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా వైసీపీ నేతలకు అంటగడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారేమోన్న అనుమానం కలుగుతోంది. ఏపీలో ఎప్పుడూ ఇంత స్థాయిలో డ్రగ్స్ పై చర్చ జరగలేదు. వారి విషయలు బయటకు వస్తాయని చర్చను పక్కదారి పట్టిస్తున్నారేమోనన్న అనుమానం కలుగుతుంది. పెద్ద మొత్తం డ్రగ్స్ పట్టుబడ్డ సమయంలో లోకేష్ దుబాయ్ ఎందుకు వెళ్లారు?
డ్రగ్స్ పై సీబీఐ, డీఆర్ఐ విచారించి అసలు విషయాన్ని రాబట్టాలి. రెండేళ్లలో 2.5 లక్షల గంజాయి ఎకరాల పంట సెబ్ సీజ్ చేశాం. త‌మ పాల‌న‌లో గంజాయి ఎంత సాగు అయ్యిందో టీడీపీ నేతలు చెప్పాలి. టీడీపీ నేతలది బూటకపు స్వభావం. చంద్రబాబు చెప్పే ప్రతిదీ అబద్ధమే. పండోరా పేపర్సులో జగన్ పేరుందని చంద్రబాబు ఎలా అనగలరు? జగన్‌పై ఎంతో కాలంగా ఆరోపణలు చేస్తున్నా.. జనం నమ్మడం లేదు.. అయినా ఈ దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. అలీషా అనే వ్యక్తి చంద్రబాబు, గంటా శ్రీనివాస్ తోనే పరిచయం. వెతికితే చాలా పట్టుకోగలం. వికీలీక్స్, పారాడైజ్ పేపర్స్, పనామా పేపర్స్, ఇప్పుడు పండోరా పేపర్స్ అంటూ విమర్శలు. పనామా పేపర్సులో హెరిటేజ్ సంస్థ ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రస్తావన ఉంది. తెల్గీ స్కామ్, హసన్ అలీ కుంభకోణం, కోలా కృష్ణమోహన్ ఇదీ టీడీపీ చరిత్ర. చంద్రబాబు స్వభావమే బూటకం. జగన్‌పై వేసినవి తప్పుడు కేసులేనని ప్రజలు నమ్మారు కాబట్టే అధికారంలోకి వచ్చాం. వైఎస్సార్ సీఎం ఉన్నప్పుడు జగన్ కనీసం సెక్రటేరియ‌ట్‌కు కూడా రాలేదు. హెరాయిన్ విషయంలో ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలపై న్యాయస్థానాలకు వెళ్తాం. చంద్రబాబును ఎక్కడ తడిమినా అనేక కుంభకోణాలు బయటపడతాయి. ఇంటర్నేషనల్ స్కామర్సుకు కన్సల్టెంటుగా పని చేయగల సిద్దహస్తుడు చంద్రబాబు’’ఇలా నాన్ స్టాప్‌గా స‌జ్జ‌ల త‌ప‌దైన శైలి దాడికి దిగారు.

వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న‌ల‌నూ ప్ర‌శ్నిస్తారా?

ఇటీవ‌లే వైసీపీ కీల‌క నేత‌, సీఎం జ‌గ‌న్ మామ గారు, జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క శాఖల మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస‌రెడ్డి త‌న మిత్ర‌బృందంతో క‌లిసి ర‌ష్యా టూర్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఆ ప‌ర్య‌ట‌న గురించి ఎవ‌రికీ తెలియ‌ద‌నే చెప్పాలి. అయితే ప్రైవేట్ జెట్‌లో త‌న విలాసాన్ని ప్రద‌ర్శించుకుంటూ ఫ్లైటెలో దిలాసాగా కూర్చున్న త‌న ఫొటోను బాలినేనే స్వ‌యంగా బయ‌ట‌పెట్టారు. ఓ మంత్రిగా ఉంటూ ఇలా ప్రైవేట్ జెట్ల‌లో విలాసం ఒక‌ల‌బోయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అంటూ దాదాపుగా అన్ని పార్టీలు కూడా వైసీపీ స‌ర్కారు నిల‌దీశాయి. అయితే ఇది త‌న వ్య‌క్తిగ‌త ప‌ర్య‌ట‌న అని, దీనిని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌జాల‌రంటూ విరుచుకుప‌డ్డ బాలినేని.. త‌న వెంట టీడీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారంటూ ఎదురు దాడికి దిగారు. అయినా బాలినేని ప‌ర్య‌ట‌న వ్య‌క్తిత‌మైనా.. అస‌లు విష‌యాన్ని చెప్ప‌కుండా త‌న డాబూ ద‌ర్పార్ని ప్ర‌ద‌ర్శించుకుంటూ ఆయ‌నే త‌న ప‌ర్య‌ట‌న‌ను వివాదాస్పంద చేసుకున్నారు. తీరా దాని వివ‌రాలు బ‌య‌ట‌పెట్ట‌మంటే మాత్రం చ‌ప్పుడు చేయ‌లేదు క‌దా. మ‌రి ఓ మాజీ మంత్రిగా విప‌క్ష పార్టీ టీడీపీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శిగా, ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్న నారా లోకేశ్ దుబాయికి వెళ్లాలంటే అంద‌రికీ చెప్పి వెళ్లాలా? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. అధికారంలో ఉండ‌గా.. త‌మ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌న్నీ మీడియాకు చెబుతూనే లోకేశ్ గానీ, చంద్ర‌బాబు గానీ సాగారు క‌దా. మరి ఇప్పుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు కాదు క‌దా.. క‌నీసం ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌కు అధికారిక హోదాలో వెళుతున్నా.. అక్క‌డ ఏం చేశార‌న్న విష‌యాన్ని స్వ‌యంగా సీఎం జ‌గ‌నే చెప్ప‌డం లేదు క‌దా. ఇలాంటి నేప‌థ్యంలో వేలాది కోట్ల మేర మాద‌క‌ద్ర‌వ్యాలు ప‌ట్టుబ‌డితే.. ఆ డ్ర‌గ్స్ విజ‌య‌వాడ‌కు త‌ర‌లివ‌స్తున్న వైనం బ‌య‌ట‌ప‌డితే.. ముందుగా స్పందించాల్సింది ప్ర‌భుత్వమే. అయితే జ‌గ‌న్ స‌ర్కారు మౌన‌వ్ర‌తాన్ని పాటిస్తే.. ఈ దందా గుట్టేమిటో తెల‌పాలంటూ బాధ్య‌త క‌లిగిన ఓ విప‌క్షంగా టీడీపీ అడ‌గ‌డంతో త‌ప్పేముంది? అదే స‌మ‌యంలో తాము ఎంత అడిగినా.. క‌నీస వివ‌ర‌ణ కూడా లేక‌పోతేనే క‌దా అధికార ప‌క్షంపై విపక్షం దాడి చేసింది. దీనిపై బాధ్య‌త‌గా స్పందించాల్సిన స‌జ్జ‌ల మ‌రీ దిగ‌జారిపోయి చంద్ర‌బాబు, ఆయ‌న ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్య‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Must Read ;- ముహూర్తం ఫిక్స్‌.. ఉండేదెవ‌రు?, ఊడేదెవ‌రు?

Tags: #TheLeoNewsandhra pradeshAndhra Pradesh Newsandhra pradesh news todayap breaking news todayap chief adviserAP cm jaganap latest newsap newsap politicsDrugsforiegn toursLatest NewsLatest Telugu Newslatest telugu news onlineleo newsleo political newsleotopsajjala ramakrishnareddytdptdp national general secretary Nara lokeshtdp national president nara chandrababunaidutelugu newsysrcp general secretery
Previous Post

డాడీ.. వీళ్లేం పాపం చేశారు?

Next Post

‘Romantic’ actress Ketika Sharma’s mind-boggling clicks in sexy attires

Related Posts

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

by లియో డెస్క్
August 13, 2026 6:39 pm

టీడీపీ రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దేశ రక్షణ...

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

by లియో డెస్క్
August 13, 2026 4:45 pm

నవ్యాంధ్ర రాజధాని అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సీఎం చంద్రబాబు విజన్‌తో అమరావతి నిర్మాణంలో...

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

by లియో డెస్క్
August 12, 2026 11:18 pm

కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై కార్యకర్తలను, నేతలను అలర్ట్...

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

by లియో డెస్క్
August 12, 2026 8:14 pm

వైఎస్సార్‌ ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్‌ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. వైఎస్ జగన్‌...

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

by లియో డెస్క్
August 12, 2026 7:50 am

మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ఇంటర్నేషనల్‌ ఇమేజ్‌ను చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది. ఈ...

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

by లియో డెస్క్
August 11, 2026 7:25 pm

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా డబుల్ ధమాకానే. రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలైన...

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

by లియో డెస్క్
August 10, 2026 11:00 pm

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా DSC నియామకాల్లో ఎలాంటి అక్రమాలు...

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

by లియో డెస్క్
August 10, 2026 10:36 pm

మహిళా SIపై దౌర్జన్యానికి దిగిన ఆమదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్‌కు పోలీసులు...

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

by లియో డెస్క్
August 10, 2026 8:49 pm

చంద్రబాబు నాయుడు..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ రాజకీయాల్లో,...

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

by లియో డెస్క్
August 10, 2026 3:50 pm

ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాగజైన్‌..ఫార్చ్యూన్ ఇండియా తన ఆగస్టు 2026 ప్రత్యేక సంచిక కవర్‌పేజీపై...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

Stunning Beauty Ruhani Sharma looks sizzling hot in these pictures

‘వెలిగొండ’పై ఆందోళ‌న మొద‌లైంది!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

మార్కండేయుడు మృత్యువును జయించడానికి ఇదీ ఒక కారణం

జైలర్ (రివ్యూ)

Bollywood Beauty Bhagyashree Mote raises the temperature with her latest sultry photoshoot

మనిషికి ఎందుకీ తాపత్రయం?

ప‌రిగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుంది?

Pushpa Fight Scenes Leaked : Mythri Movie Makers Producer Serious Reaction on Movie Leaks

ముఖ్య కథనాలు

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

తొలి జీతం.. అమరవీరుల కుటుంబాలకు.. ఎంపీ చింతకాయల విజయ్‌ గొప్ప మనసు..

అమరావతికి రాచబాట..సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!

ఫేక్ అకౌంట్లతో వైసీపీ కుట్ర.. కార్యకర్తలకు కూటమి వార్నింగ్.!

జగన్‌ కూతురు పొలిటికల్‌ ఎంట్రీ.. అవినాష్‌ రెడ్డి గుండెల్లో దడ..!

లోకేష్ బ్రాండ్‌పై వైసీపీ అక్కసు.. నకిలీ జీవోలతో డ్రామా..!

ఏపీకి డబుల్ ధమాకా..విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు లైన్ క్లియర్..!

మెగా DSCపై వైసీపీవి డ్రామాలు..కాంగ్రెస్ నేత చింతా మోహన్ సంచలనం..!

లేడీ సింగమ్స్ దెబ్బ..వైసీపీ నేత చింతాడను నడిరోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు.!

చంద్రబాబు ప్రొఫెషనల్ లీడర్‌షిప్..రిటైర్డ్ IAS ఖ్వాజా ప్రశంసలు..

ఆంధ్ర రైజింగ్ స్టార్..ఫార్చ్యూన్ కవర్ పేజీపై నారా లోకేష్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist