యంగ్ హీరో దగ్గుబాటి రానా, సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తోన్న సామాజిక సందేశాత్మక చిత్రం ‘విరాటపర్వం’. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో 1992 లో జరిగిన కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ పీరియాడికల్ మూవీకి దర్శకుడు వేణు ఊడుగుల. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ చాలా లేటయింది. ఇటీవల తిరిగి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళిన చిత్ర బృందం.. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా ‘విరాటపర్వం’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో రానా గెటప్, మేకోవర్ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.
డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవన్నగా రానా తన పాత్రలో జీవించాడు. ఏ విధమైన డైలాగ్స్ లేకుండా.. దట్టమైన అడవుల్లో నక్సల్స్ సమావేశం.. ప్రజల అగచాట్లు .. పోలీసుల కూంబింగ్ .. పేదవారి సమస్యలు.. వాటి పట్ల రవన్న స్పందన.. వ్యవస్థ పట్ల ఆవేశం.. పోరుబాట లాంటివన్నీ ఈ టీజర్స్ లో హైలైట్ పాయింట్స్ గా రివీలయ్యాయి. గతంలో విడుదలైన నక్సలిజమ్ సినిమాలకన్నా విరాటపర్వం సినిమా చాలా విభిన్నంగా ఉండబోతోందని టీజర్ ను బట్టి అర్ధమవుతోంది. మరి ఈ సినిమా రానా కెరీర్ ను ఏ విధంగా మలుపుతిప్పుతుందో చూడాలి.
Must Read ;- ఆయన క్రేజ్ ఆకాశమంత! (రానా జన్మదిన ప్రత్యేకం )