హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ కాన్వాయ్ పెను ప్రమాదం నుండి బయటపడింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిలో నల్గొండ జిల్లా కైతాపురం వద్ద దత్తాత్రాయ ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకుపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఆ సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు మరో ఇద్దరు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో దత్తాత్రేయ ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. కానీ, దత్తాత్రేయ సహాయకునికి మాత్రం స్వల్పగాయాలైనట్లు సమాచారం. అతనిని వెంటనే వేరే వాహనంలో హైదరాబాద్ తరలించారు.
దత్తాత్రేయ వేరే వాహనంలో నల్గొండ చేరుకున్నట్లు సమాచారం. హైదరాబార్ నుండి సూర్యపేట వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరకుని పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం అందింది.
Must Read ;- ఏళ్ల తరబడి ప్రతిపాదనలు.. బాగుపడని ప్రధాన రహదారులు