ఈ మధ్యకాలంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేకమంది హీరో, హీరోయిన్లు ఒక ఇంటివారు అయ్యారు. అందులో హీరో రానా, నితిన్, కాజల్, నిహారిక తదితరులు ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఆయన మొదటి సినిమా ‘మెంటల్ మదిలో’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తీసిన ‘బ్రోచేవారెవరురా‘ సినిమాతో ఒక సాలిడ్ హిట్ అందుకున్నాడు వివేక్. ఇందులో హీరో, హీరోయిన్లగా శ్రీ విష్ణు, నివేదా థామస్ నటించారు.
వివేక్ ఈమధ్యనే ఒక ఇంటివాడు అయ్యాడు. తన స్వీట్ హార్ట్ శ్రీజ గౌనిని వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు హీరో శ్రీవిష్ణు అయన భార్యతో కలిసి హాజరైయ్యారు. అలాగే నివేదా థామస్ కూడా తన సోదరుడు నిఖిల్ థామస్ తో అటెండ్ అయ్యింది. పెళ్ళికి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది నివేదా. అందులోని ఒక ఫొటోలో నివేదా, ఆమె తమ్ముడు, శ్రీవిష్ణు, ఆయన భార్య ఫ్రెండ్స్ అందరూ కలిసి సందడి చేస్తున్నారు. మరొక ఫొటోలో దర్శకుడు వివేక్, దంపతులు, శ్రీవిష్ణు దంపతుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు.
ఈ ఫొటోతో పాటు మంచి మెస్సేజ్ ను కూడా పోస్ట్ చేసింది నివేదా. ‘నీకు మంచి ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. లవ్ యూ బోథ్’ అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివేక్ కు వివాహ వేడుక శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు. ఆయన వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నారు. తొలి రెండు సినిమాలతో మంచి దర్శకుడిగా నిరూపించుకున్న వివేక్ ఆత్రేయ ప్రస్తుతం హీరో నాని సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లే పనిలో ఉన్నాడు. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలవుతోందని సమాచారం.
Must Read ;- అను ఇమ్మాన్యుయేల్ కి, మరో ముద్దుగుమ్మకి పోలికలా? అవేంటి?