టాలీవుడ్ దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం ఇతిహాస ప్రణయ కావ్యం ‘శాకుంతలం’ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. కాళిదాసు రాసిన మహాకావ్యం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. మహాభారతంలోని ఆదిపర్వంలో వచ్చే రసవత్తర ఘట్టం శకుంతల, దుష్యంతుల ప్రణయ గాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో శకుంతలగా అందాల సమంతా అక్కినేని నటిస్తుండగా.. దుష్యుంతుడుగా ఎవరు నటించబోతున్నారనే విషయంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆ సస్పెన్స్ తొలగిపోయింది.
సమంతా అక్కినేని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ‘శాకుంతలం’ సినిమాలో దుష్యంతుడుగా నటించబోయేది ఎవరో రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఇందులో దుష్యంతుడుగా నటించబోయేది ఎవరో తెలుసా? మలయాళ హ్యాండ్సమ్ హీరో దేవ్ మోహన్. లాక్ డౌన్ లో ఓటీటీలో విడుదలైన ‘సూఫీయుమ్ సుజాతయుమ్’ మలయాళ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు ఇతగాడు. ఆ సినిమా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పురు వంశ రాకుమారుడు దుష్యంతుడుగా దేవ్ మోహన్ నటిస్తున్నాడంటూ సమంత ప్రకటించింది. దీంతో దేవ్ మోహన్ పై ఆరా తీయడం మొదలుపెట్టారు టాలీవుడ్ ప్రేక్షకులు. అతిత్వరలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళనున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
Must Read ;- పాన్ ఇండియా దిశగా శాకుంతలం
Here’s introducing our Prince Charming … DUSHYANT 🤴🏽 @ActorDevMohanhttps://t.co/cqFNzAUsiI #Shaakuntalam @gunasekhar1 @neelima_guna @gunaateamworks
— Samantha Akkineni (@Samanthaprabhu2) March 6, 2021