నందమూరి నటసింహం బాలకృష్ణ భారీ యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కలిసి చేసిన సింహ, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కావడంతో వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రేజీ మూవీని జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్ లో తాజా షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.
ఈ మూవీ స్టార్ట్ అయి చాలా రోజులు అయ్యింది కానీ.. టైటిల్ ఏంటి అనేది కన్ ఫర్మ్ కాలేదు. సింహ, లెజెండ్ టైటిల్స్ వలే.. ఈ సినిమాకి కూడా పవర్ ఫుల్ టైటిల్ పెడతారని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఈ చిత్రానికి మోనార్క్ అనే టైటిల్ కన్ ఫర్మ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. బాలయ్య పుట్టినరోజున టీజర్ రిలీజ్ చేసారు. అప్పుడే మూవీ టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారనుకున్నారు కానీ.. ఎనౌన్స్ చేయలేదు. ఆతర్వాత మోనార్క్ టైటిల్ కాకుండా డేంజర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా ఓ వార్త వచ్చింది.
మోనార్క్, డేంజర్ టైటిల్స్ తో పాటు ప్రచారంలోకి వచ్చిన మరో టైటిల్ టార్చ్ బెర్రర్. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో టార్చ్ బెర్రర్ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఆ సన్నివేశం ఆ సినిమాకే హైలెట్ గా నిలిచింది. దీంతో టార్చ్ బెర్రర్ టైటిల్ నే ఫిక్స్ చేస్తారని గట్టిగా వినిపించింది కానీ.. ఈ టైటిల్ ని ఎనౌన్స్ చేయలేదు. అయితే.. మోనార్క్, డేంజర్, టార్చ్ బెర్రర్.. ఈ మూడు టైటిల్స్ లో ఏ టైటిల్ కన్ ఫర్మ్ చేస్తారంటే.. మోనార్క్ అనే టైటిల్ నే ఖరారు చేయనున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఈ టైటిల్ బాలయ్యకు కరెక్ట్ గా సెట్ అవుతుందని..ఈ టైటిలే ఫిక్స్ చేయాలని బోయపాటి అనుకుంటున్నారట. మరి.. మోనార్క్ టైటిల్ నే ఫిక్స్ చేస్తారో లేక వేరే టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.
Also Read: అక్కడ విజయ్.. ఇక్కడ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా?