నాగార్జున సాగర్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు సవాల్ గా మారింది. దాంతో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారింది. కాంగ్రెస్ మాత్రమే అభ్యర్థిని ప్రకటించగా, టీఆర్ఎస్ మాత్రం ఎన్నో సంప్రతింపులు జరిపి ప్రకటించింది. తాజాగా నాగార్జున సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు అయింది. నోముల భగత్ నే సాగర్ ఉప ఎన్నికల అభ్యర్థి అని స్పష్టం చేసింది. భగత్ సీఎం కేసీఆర్ ను కలిసి బీఫాం తీసుకున్నారు. రేపు ఉదయం ఆయన నామినేషన్ వేయనున్నారు. భగత్ తోపాటు కోటిరెడ్డి కూడా రేసులో ఉన్నారు. అలకబూనిన కోటిరెడ్డిని టీఆర్ఎస్ నాయకులు బుజ్జగించారు.
Must Read ;- ఖబర్దార్ కేసీఆర్ : భగ్గుమన్న వరంగల్ విద్యార్థులు