నక్షత్రం సినిమా తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం వహించిన సినిమా ‘రంగమార్తాండ’. మారాఠీ సూపర్ హిట్ మూవీ నట సామ్రాట్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఒరిజినల్ వెర్షన్ లో నానా పటేకర్ పోషించిన పాత్రను .. తెలుగు వెర్షన్ లో ప్రకాశ్ రాజ్ చేస్తున్నారు. అందులో ఆయన భార్యగా రమ్యకృష్ణ, కూతురిగా రాజశేఖర్ కూతురు శివాత్మిక నటిస్తున్నారు.
ఇంకా ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ అల్లుడిగా రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. మరో ముఖ్యపాత్రను అనసూయ చేస్తోందట. అలాగే ఇందులో బ్రహ్మానందం తన కెరీర్ లోనే గుర్తుండిపోయే ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తున్నాడట. ఒక విధంగా ఆయనకిది సెకండ్ ఇన్నింగ్సని అంటున్నారు.
నాటకరంగం లో ఎనలేని అనుభవం సంపాదించి.. నటసామ్రాట్ అనే బిరుదు పొందిన ఒక మహానటుడు తన కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవడమే ‘రంగమార్తాండ’ సినిమా కథాంశం. ఈ సినిమా టాకీ పార్ట్ ను పూర్తి చేసుకుంది. కాగా.. మే లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఆ టైమ్ లో పెద్ద హీరోల సినిమాలతో క్లాష్ రాకుండా ఓ డేట్ నిర్ణయించబోతున్నారట. మరి ఈ సినిమాతో కృష్ణవంశీ దర్శకుడిగా బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.
Must Read ;- ‘అన్నం’ పరబ్రహ్మ స్వరూపం అంటున్న కృష్ణవంశీ