సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో సైతం సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్’ టైటిల్ తో రీమేక్ అయ్యింది. సందీప్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటించారు.
ఈ సినిమా తర్వాత షాహిద్ కపూర్ నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేశారు. తెలుగులో జెర్సీ చిత్రానికి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరినే బాలీవుడ్ లో ‘జెర్సీ’ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించారు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే.. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ చిత్రం ‘క్రాక్’. మలినేని గోపీచంద్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
‘క్రాక్’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో డైరెక్టర్ మలినేని గోపీచంద్ కు బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ‘క్రాక్’ బాలీవుడ్ రీమేక్ లో సల్మాన్ ఖాన్ కానీ, అజయ్ దేవగన్ కానీ నటిస్తారని వార్తలు వచ్చాయి. అలాగే ఇదే సినిమా హిందీ రీమేక్ తో సోనూ సూద్ హీరోగా రంగ ప్రవేశం చేస్తున్నారని కూడా టాక్స్ వినిపించాయి అయితే.. షాహిద్ కఫూర్ ‘క్రాక్’ బాలీవుడ్ రీమేక్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తెలిసింది. మరి.. షాహిద్ కఫూర్ తో గోపీచంద్ ‘క్రాక్’ బాలీవుడ్ రీమేక్ తెరకెక్కిస్తారా..లేక వేరే హీరోతో చేస్తారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఆహా అనిపించనున్న క్రాక్











