పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలంలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కోడి పుంజులను దొంగిలించారనే నెపంతో దళిత యువకులను చెట్టుకు కొట్టేసి కొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. జగ్గవరం గ్రామానికి చెందిన యువకులు లింగపాలెం మండలం సింగగూడెం గ్రామానికి వారి బంధువుల ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో గోర్తుపాడు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, ఆ దారిన వెళ్తున్న జగ్గవరానికి చెందిన దళిత యువకులను కోడి పుంజులు దొంగిలించారనే నెపంతో ఒక రాత్రి మొత్తం చెట్లకు కట్టేసి విచక్షణ రహితంగా కర్రలతో వైర్లతో కొట్టారు.
ప్రస్తుతం చింతలపూడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన యువకులు, తమను గోర్తుపాడు గ్రామంలోని అగ్రకులానికి చెందిన కొందరు వ్యక్తులు అన్యాయంగా కొట్టారని ఫిర్యాదు చేశారు.
Must Read ;- జగన్ నియోజకవర్గంలో దళిత మహిళపై దారుణం











