కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెద్దకుడాల గ్రామంలో ఎన్.నాగమ్మ (45) అనే దళిత మహిళ (మాదిగ) పై హత్యాచారం జరిగింది. ఆమెపై అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశారు. అత్యాచారం అనంతరం, రాయడానికి కూడా సహించలేనంత ఘోరంగా ఆమెను బాధించి హత్య చేసినట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం మేరకు ఈ హత్యాచారం వివరాలు ఇలా ఉన్నాయి. నాగమ్మ సోమవారం మేకలను మేపుకొనేందుకు ఇంటి ఓబాయపల్లె గ్రామ పొలాల్లోకి వెళ్లింది. సాయంత్రం మేకలు ఇంటికి తిరిగి వచ్చినా నాగమ్మ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెతికేందుకు వెళ్లగా ఇంటిఓబాయపల్లె గ్రామ సమీపంలో శవమై కనిపించింది.
నాగమ్మకు సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామానికి చెందిన నరసింహులుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. దంపతుల మద్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఆమె ఆరేళ్ల నుంచి పెద్దకుడాలలోని తల్లి పుల్లమ్మ వద్ద ఉంటున్నారు. మృతదేహానికి శవపరీక్ష చేసిన రిపోర్టు ఇంకా అందలేదు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించడం జరిగింది గానీ.. వ్యవహారం బయటకు పొక్కకుడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. నాగమ్మ మృతదేహానికి సోమవారం సాయంత్రం దహన సంస్కారాలు చేశారు. మీడియాలో కూడా ఎక్కడా బయటకు రాలేదని తెలుస్తోంది.
Must Read ;- జగన్ హామీ ఏమైందో? ఢిల్లీకి సుగాలి ప్రీతి కుటుంబం!!
జగన్ నియోజకవర్గం కావడంవల్లే జాగ్రత్తలా
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడం వల్లనే.. ఈ దారుణం గురించి బయటకు పొక్కకుండా.. జాగ్రత్తలు తీసుకున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ హత్యాచారం కేసు విచారణలో ఇప్పటిదాకా ఎలాంటి ముందడుగు పడినట్లు తెలియలేదు. ఇంత దారుణం జరిగినప్పటికీ.. ఎక్కడకా బయటకు రాకపోవడం వెనుక కారణాలు తెలియడం లేదు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన దళితమహిళపై అత్యాచారం స్థాయిలో ఈ వ్యవహారం వల్ల ప్రభుత్వానికి పరువుపోతుందని భయపడ్డారా అనే అనుమానాలు కూడా ప్రజలకు కలుగుతున్నాయి. ఈ దారుణం పెద్ద వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది.
Also Read ;- దిశ చట్టం అమలులో వైసీపీ ప్రభుత్వం విఫలం