కొవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకునేందుకు ప్రతిఒక్కరూ విధిగా మాస్కులు ధరిస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి కొందరు డబుల్ మాస్క్ ను సైతం ధరించడానికి ఇష్టం చూపుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా మాస్క్ ధరించాలనే నిబంధనను కఠినతరం చేశాయి. మాస్కు ధరించనివాళ్లపై జరిమానాలు విధించి, హెచ్చరించిన సంఘటనలను మనం చూశాం. ప్రజలకు మాస్క్ లు ధరించాల్సిన అవసరం గురించి చెప్పాల్సిన నేతలే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా బీజేపీ మంత్రి ఒకరు ఫేస్ మాస్క్ ను తన కాలికి ధరించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఉత్తరాఖండ్లో బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశంలో పాల్గొన్నారు. అందులో ముగ్గురు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే వాళ్లలో యతీశ్వరానంద్ అనే మంత్రి మాస్క్ ను ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొన్నారు. బాధ్యతగా ఉండాల్సిన మంత్రిగారే.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఫొటోలను కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో పెట్టారు. మాస్కులు పెట్టుకోని బీజేపీ నేతలను శిక్షించాలని విమర్శించారు. ‘మంత్రిగారూ.. కాలి వేలికి మాస్క్ ధరించి.. సమాజానికి ఏ మేసెజ్ ఇద్దామనుకుంటున్నారు’ అని నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.
Must Read ;- రైతులపై రాజద్రోహం!.. బీజేపీ ఉద్దేశమేంటో?