దేశంలో కరోనా కేసులు క్రమక్రంగా తగ్గుతున్నాయి. కొత్త కేసుల పాటు మరణాలు కూడా చాలా తక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కరోనా కాస్తా విశ్రాంతినివ్వడంతో పలు రాష్ట్రాలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఆర్థిక కార్యాకలాపాలు దెబ్బతినకుండా పాక్షిక లాక్ డౌన్ ను విధిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 51,667 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 1,329 మంది మృతి చెందారు. మొత్తం దేశవ్యాప్తంగా కరోనా కేసులు 3,01,34,445కు చేరాయి. 6,12,868 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 2,91,28,267 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. 30.79 కోట్లకు పైగా వ్యాక్సినేషన్స్ తీసుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ తెలిపింది.
తెలంగాణలో..
తెలంగాణలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 12 మంది చనిపోయారు. 1280 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,598 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ లో రోజుకు 200 లోపు కేసులు నమోదు అవుతుండటంతో జనసంచారం మరింత పెరిగింది.
మాస్కులు మస్ట్
కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తేసినా.. కొవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నాయి. మాస్కులు ధరించకపోతే.. జరిమానాలు విధిస్తున్నాయి. భౌతిక దూరం పాటించకపోతే హెచ్చరిస్తున్నాయి. కొత్త కేసులు భారీగా తగ్గినా.. నిబంధనలను పాటించాల్సిందేనని సూచిస్తున్నాయి. వ్యాక్సిన్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నాయి. మెగా డ్రైవ్ లు నిర్వహిస్తూ.. అర్హులైనవాళ్లకు వ్యాక్సిన్ అందించే ప్రయత్నాలు చేస్తున్నాయి. టీకా వేసుకునేందుకు మొబైల్ వాహానాలను సైతం ప్రారంభిస్తున్నాయి. ఎత్తేసింది లాక్ డౌన్ మాత్రమే.. కరోనాను కాదు అనే విషయం కూడా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- రూపు మార్చుకుంటూ.. ఎందరినో బలి తీసుకుంటూ