‘గద్దలకొండ గణేశ్’ .. ‘ఎఫ్ 2’ సినిమాల సక్సెస్ తో వరుణ్ తేజ్ మాంఛి జోరుమీదున్నాడు. అదే ఊపును కంటిన్యూ చేయాలనే కసితో ముందుకు వెళ్లాడు గానీ, కరోనా కళ్లెం వేసేసింది. దాంతో ఆయన ఎప్పుడో మొదలుపెట్టవలసిన ‘గని’ సినిమా, ఆలస్యంగా పట్టాలపైకి వెళ్లింది. అప్పటి నుంచి కూడా చకచకా షూటింగు జరుపుకుంటూనే ఉంది. అల్లు బాబీ – సిద్ధు ముద్ద ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, షూటింగు పరంగా ముగింపు దశకి చేరుకుంది. సయీ మంజ్రేకర్ ఈ సినిమాతో తెలుగు తెరపై తొలిసారిగా మెరవనుంది. ఈ సినిమాతో ఇక్కడ ఈ అమ్మాయి హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఓ ముఖ్యమైన పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నాడు.
కరోనా కారణంగా చాలా సినిమాల షూటింగులు ఆగిపోయాయి. లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత అన్నీ సెట్స్ పైకి వెళ్లాయి. ఇప్పడు అదే విధంగా అన్ని ముగింపు దశకి చేరుకున్నాయి. ఈ సినిమాలు తమ ముందున్న దసరా .. దీపావళి .. సంక్రాంతి పండుగ రోజులపై కర్చీఫ్ లు వేసేస్తున్నాయి. ‘గని’ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇదే రిలీజ్ డేట్ ఖరారవుతుందేమో చూడాలి మరి.
Must Read ;- ఎఫ్ 3 తో సంక్రాంతికి సందడి చేద్దాం: వెంకటేశ్











