ఏపీలోని కృష్ణా జిల్లా అంటేనే.. సిరిసంపదలతో తులతూగే జిల్లానే మన కళ్ల ముందు కనబడుతుంది. రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో కృష్ణా నదీ తీరంలో ఉండే ఈ జిల్లా వ్యవసాయ పరంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా కీలక భూమిక పోషిస్తోంది. టీడీపీ అధినేత స్వర్గీయ ఎన్టీఆర్ సొంత జిల్లాగా ఈ జిల్లాకు ఎనలేని ప్రాధాన్యం కూడా ఉంది. ఇన్నేసి ప్రత్యేకతలు ఉన్న ఈ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల నియోజకవర్గాలు వైసీపీ పాలనలో అసాంఘీక కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. జిల్లా నుంచి మొత్తం ముగ్గురు మంత్రులుంటే.. ఇద్దరు మంత్రులు ఇలాంటి వ్యవహారాలతో అభాసుపాలవుతుంటే.. ఇంకొకరేమో తనదైన శైలి చేతివాటంతో అన్ని పార్టీలకు టార్గెట్ అవుతున్నారు.
పేర్ని ఇలాకాలో వెయ్యితో మస్తు మజా
రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖతో పాటు రవాణా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని) జగన్ కేబినెట్ లో కీలక మంత్రి కిందే లెక్క. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం అసెంబ్లీ స్థానం నుంచి ఈయన గెలుపొందారు. బందరు పోర్టు ఈయన నియోజకవర్గ పరిధిలోనే ఉంది. అదే సమయంలో రాష్ట్రంలోని పేరొందిన బీచ్ లలో ఒకటైన మంగినపూడి బీచ్ కూడా ఈయన గారి నియోజకవర్గంలోనే ఉంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ బీచ్ లో ఓ రిసార్టును కూడా నిర్వహిస్తోంది. గురువారం ఉన్నట్లుండి పోలీసులు ఈ రిసార్టుపై మెరుపు దాడి చేశారు. ఈ దాడితో 8 జంటలు పోలీసులకు చిక్కాయి. పోలీసుల అలికిడిని కాస్తంత ముందుగానే గమనించిన మరికొన్ని జంటలు పారిపోయాయి. అయితే ఇక్కడ ఏం జరుగుతోందంటే.. రిసార్టుల్లోని రూములను పర్యాటకులకు ఇవ్వాల్సిన రిసార్ట్ యాజమాన్యం.. కేవలం శృంగారం కోసం వచ్చే జంటలకు ఇస్తున్నారట. ఇలాంటి జంటల వద్ద గంటకు రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారట. వెయ్యి పోతే పొయ్యింది.. గంట పాటు అన్ని సౌకర్యాలున్న రిసార్టు గదుల్లో ఎంజాయ్ చేయొచ్చన్న భావనతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో జంటలు వస్తున్నాయట. మొత్తంగా పర్యాటక కేంద్రంగా విలసిల్లాల్సినంగినపూడి.. ఇప్పుడు అసాంఘీక కార్యకలాపాలకు వేదికగా మారిపోయింది.
కొడాలి కోటలో పేకాట
ఇక జగన్ కేబినెట్ లో మరో కీలక మంత్రిగానే కాకుండా నిత్యం బూతులు మాట్లాడుతూ బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (కొడాలి నాని) నియోజకవర్గంలో పేకాట జోరుగా సాగుతున్న వైనం ఇటీవల పెను కలకలమే రేపింది. కొడాలి సొంత బంధువులు, సన్నిహితుల ఆధ్వర్యంలోనే పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయని, ఈ వ్యవహారంతో రోజుకు కోట్లలో డబ్బు చేతులు మారుతోందన్న వార్తలు కలకలమే రేపాయి. ఈ వ్యవహారంపై స్పందించిన నాని.. అదేమీ అంత తప్పు కాదన్నట్లుగా తనదైన శైలి వ్యాఖ్యలు చేసి మరింత కలకలం రేపారు. మొత్తంగా కొడాలి నియోజకవక్గం పేకాటకు కేంద్రమైతే.. పేర్ని నాని నియోజకవర్గం అశ్లీల కార్యకలాపాలకు కేంద్రంగా మారిపోయిందన్న మాట. మరి ఈ పరిస్థితిని ఎవరు చక్కదిద్దుతారో చూడాలి.
Must Read ;- ఏపీ సీఎం జగన్ ఇక మాజీనే