ఓదెల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ` ఓదెల రైల్వేస్టేషన్`. చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కన్నడంలో ఇండియా vs ఇంగ్లాండ్, మాయబజార్ 2016, 8MM బుల్లెట్ వంటి దాదాపు పాతిక చిత్రాలలో నటించిన వశిష్ట ఎన్. సింహ ఈ చిత్రం ద్వారా తెలుగులో హీరోగా పరిచయమవుతున్నారు. అలాగే అశోక్ తేజ దీని ద్వారా మొదటి సారి మెగాఫోన్ పడుతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది కథ, స్క్రీన్‌ప్లే, సంబాషలను అందిస్తుండటం విశేషం. ఇందులో పల్లెటూరి అమ్మాయిగా రాధ పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ కనిపించనుంది. ఈ మధ్య విడుదల చేసిన హెభా పటేల్ లుక్ కి చాలా మంచి స్పందన లభించిందని చిత్రబృందం తెలిపింది. కాగా తిరుపతి పాత్రను పోషిస్తున్న హీరో వశిష్ట సింహ లుక్ ను శనివారం యూనిట్ విడుదల చేసింది. దుస్తులు ఇస్త్రీ చేస్తున్న పల్లెటూరి యువకుడిగా ఈ లుక్ లో హీరో కనిపిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు అశోక్ తేజ్ మాట్లాడుతూ ‘ఈ క్రైమ్ థ్రిల్లర్ కథను వైవిధ్యంగా, విభిన్నంగా మలుస్తున్నాం మేకప్ తో పాటు డ్రీం సన్నివేశాలు, పాటలు లేకుండా సహజత్వానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరణ చేశాం“ అని చెప్పారు. . నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ సినిమా నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయని అన్నారు.
సంపత్‌నంది మాట్లాడుతూ ఈ చిత్రంలోని హీరో పాత్ర తనకెంతో ఇష్టమైందన్నారు. అందరికీ ఎంతో నచ్చుతుందని చెప్పారు. కన్నడ లో గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట సింహ కు తెలుగు లో ఇది మంచి ఆరంభమవుతుందన్నారు. హీరో వశిష్ట సింహ మాట్లాడుతూ ఇంత మంచి బ్యానర్ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. పక్కా పల్లెటూరి అబ్బాయిగా ఇందులో నటిస్తున్నాను. తెలుగులో ఈ తొలి చిత్రం నాకు మలుపునిస్తుంది అని ఆశిస్తున్నా అని అన్నారు. వశిష్టసింహ, హెబా పటేల్, సాయిరోనక్, పూజితా పొన్నాడ, నాగమహేష్ (రంగస్థలం ఫేమ్), భూపాల్, శ్రీగగన్, దివ్య సైరస్, సురేందర్ రెడ్డి, ప్రియా హెగ్దె తదితరులు నటిస్తోన్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫిని ఎస్. సౌందర్ రాజన్, సంగీతాన్ని: అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు,
Must Read ;- అనారోగ్యంతో బాధపడుతున్న కన్నడ బ్యూటీకి కరోనా పరీక్షలు











