కోల్డ్ కేస్
మర్డర్ మిస్టరీలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఓటీటీకి ఇవి బెస్ట్ ఆప్షన్. ఈ వారం కూడా ఓ మర్డర్ మిస్టరీ రాబోతోంది. దీని పేరు కోల్డ్ కేస్. ఎన్నో చిక్కుముడులతో ఎవ్వరికీ అర్థంకాని విధంగా తయారైన ఓ మర్డర్ కేసును ఓ పోలీస్ ఆఫీసర్, ఓ పరిశోధనాత్మక జర్నలిస్ట్.. తమదైన శైలిలో ఛేదించుకుంటూ వచ్చారు. అలా పరిశోధన చేసుకుంటూ ఒక దగ్గరకొచ్చేసరికి ఇద్దరూ కలుస్తారు. ఆ టైమ్ లో వాళ్లు తెలుసుకున్న ఊహించని, నమ్మలేని నిజాలేంటి? ఇదే కోల్డ్ కేస్. ఈ మలయాళం సినిమా 30వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. పృధ్వీరాజ్, అదితి బాలన్ ముఖ్యపాత్రలు.
హసీన్ దిల్ రుబా
ఇది కూడా మర్డర్ మిస్టరీనే. భర్త హత్యకు గురవుతాడు. దర్యాప్తులో భాగంగా భార్య నివురుగప్పిన నిజాల్ని బయటపెడుతుంది. తమ వివాహ బంధంలో ఉన్న చీకటి కోణాల్ని బయటపెడుతుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారనేది ట్విస్ట్. తాప్సి లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో హర్షవర్థన్ రాణె కీలక పాత్ర పోషించాడు. జులై 2న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది ఈ సినిమా.
ది టుమారో వార్
యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారి కోసం ఈ వారం సిద్ధంగా ఉన్న సినిమా ది టుమారో వార్. ఇది సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా. గ్రహాంతరవాసుల్ని ఎదుర్కొనేందుకు, మనుషులు ఓ సరికొత్త టెక్నాలజీ సహాయంతో భవిష్యత్తులోకి వెళ్తారు. అలా ఫ్యూచర్ లో గ్రహాంతరవాసులతో యుద్ధం చేసి గెలుస్తారు. ఇదీ ఈ సినిమా స్టోరీ. జులై 2న అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇంటర్నేషనల్ ఆడియన్స్ తో పాటు.. చాలామంది ఇండియన్స్ ఈ సినిమా కోసం వెయిటింగ్.
ఫియర్ స్ట్రీట్ పార్ట్-1
ఆర్టీ స్టయిన్ అనే రచయిత ఫియర్ స్ట్రీట్ పేరిట పుస్తకం రాశాడు. మొత్తం 3 భాగాలుగా ఈ పుస్తకం ప్రచురితమైంది. ఇందులో మొదటి పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన సినిమా ఫియర్ స్ట్రీట్ పార్ట్-1. కంప్లీట్ గా హారర్ మూవీ ఇది. శాపానికి గురైన ఇద్దరు వ్యక్తులు దశాబ్దాలుగా విడివిడిగా ఉంటారు. అయినప్పటికీ తమ శాపం కారణంగా ఒకరికొకరు కనెక్ట్ అయి ఉంటారు. వరుస హత్యల నేపథ్యంలో.. వీళ్లిద్దరూ కలిసి తీసుకున్న కామన్ నిర్ణయం ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈవారం ఓటీటీలోకి ఈ సినిమాలతో పాటు.. మరికొన్ని వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి. వీటిలో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.
Must Read ;- లైగర్ కు 200 కోట్ల ఓటీటీ ఆఫర్. విజయ్ ఏమన్నాడో తెలుసా.?